News April 20, 2024
విశాఖ: జగన్ బస్సుయాత్ర షెడ్యూల్ ఇదే

సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్‌ని వైసీపీ నేతలు విడుదల చేశారు. ఈరోజు ఉ.9 గంటలకు గొడిచర్ల రాత్రి బస నుంచి బయలుదేరి నక్కపల్లి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సా.3:30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయపాలెం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
Similar News
News October 9, 2025
VMRDA కమిషనర్ కే.ఎస్.విశ్వనాథన్ బదిలీ

VMRDA కమిషనర్ కే.ఎస్.విశ్వనాథన్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్‌గా ఆయనను నియమించారు. VMRDA కమిషనర్‌గా విశ్వనాథన్ పలు సంస్కరణలను చేపట్టారు. VMRDA పరిధిలో ఉన్న టూరిజం, కళ్యాణమండపాలను అభివృద్ధి దిశగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించారు.
News October 9, 2025
VMRDA కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్

ఎల్ఆర్ఎస్ పథకం కింద అనధికార లేఔట్లలోని స్థలాల క్రమబద్ధీకరణ కోసం VMRDA కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈనెలాఖరులో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల గడువు ముగుస్తుంది. వీఎంఆర్డీఏకు ఇప్పటివరకు 585 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఎల్ఆర్ఎస్‌కి దరఖాస్తు చేసుకునే విధానంపై హెల్ప్ డెస్క్‌లో అవగాహన కల్పిస్తున్నారు.
News October 9, 2025
అభివృద్ది ప్రాజెక్టుల భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టు, రైల్వే లైన్ల విస్తరణ, ఇతర పనుల భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో అధికారులతో సమావేశమయ్యారు.అభివృద్ధి ప్రాజెక్టుల పనులను క్షేత్రస్థాయి పర్యటనలు చేసి చర్యలు చేపట్టాలన్నారు. నిర్ణీత కాలపరిమితిలో పనులు పూర్తి చేయాలన్నారు.