News March 2, 2025
విశాఖ జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ ఏయూతో కలిసి పనిచేయడానికి ఐడీసీ సిద్ధం
➤ విశాఖ రేంజ్‌లో ఎస్ఐలుగా బావ, బామ్మర్ది
➤ ఏయూ శతాబ్ది ఉత్సవాలలో ప్రతీ ఒక్కరూ కీలక భూమిక పోషించాలి: వీసీ
➤ బడి రుణం తీర్చుకుంటున్న గాజువాక పూర్వ విద్యార్థులు
➤ రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు
➤ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్
Similar News
News December 30, 2025
ఈ ఏడాది నేరాలను తగ్గుముఖం పట్టించాం: విశాఖ సీపీ

విశాఖలో పోలీసులు చేసిన కృషి వల్ల 17 విభాగాల్లో గత ఏడాది కంటే నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య తగ్గించగలిగామని సీపీ శంఖబత్ర భాగ్చీ వెల్లడించారు. వార్షిక ముగింపులో భాగంగా ఆయన మాట్లాడారు. గత ఏడాది 5,921 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 5,168 కేసులు నమోదయ్యాయని చెప్పారు. మర్డర్ కేసులు 35 నమోదు కాగా.. కిడ్నాప్ కేసులు 17, హత్యాయత్నం కేసులు 135 నమోదు చేసినట్లు తెలిపారు.
News December 30, 2025
REWIND: సైబర్ క్రైమ్‌లో 205 మంది అరెస్ట్.. విశాఖ సీపీ

విశాఖలో 2025లో సైబర్ క్రైమ్ సంబంధించి 205 మందిని అరెస్టు చేశామని సీపీ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. వీరి నుంచి రూ.14.64 కోట్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామని వివరించారు. వార్షిక సమావేశం ముగింపులో ఆయన మాట్లాడారు. విశాఖలో నేర, శాంతి భద్రతలు, ట్రాఫిక్, ఇతర అంశాలపై సుదీర్ఘంగా వివరించారు. సమావేశంలో డీసీపీ మణికంఠ, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.
News December 30, 2025
న్యూ ఇయర్ వేళ విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు..

విశాఖలో నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, ఆర్కే బీచ్ రోడ్డు, BRTS రోడ్లపై వాహనాలకు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘించినా, మద్యం తాగి నడిపినా వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. బీచ్ సందర్శకులకు ఏయూ గ్రౌండ్స్, APIIC గ్రౌండ్, గోకుల్ పార్కుల్లో పార్కింగ్ కేటాయించామని ADCP ప్రవీణ్ కుమార్ తెలిపారు.


