News August 14, 2025

విశాఖ జిల్లాలో 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 165.2 మి.మీల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా పద్మనాభం మండలంలో 51.4mm, అత్యల్పంగా ములగడలో 5.6mm వర్షపాతం నమోదయింది. పెందుర్తిలో 18.2, భీమునిపట్నంలో 14.2 మి.మీ వర్షపాతం కురిసింది. రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Similar News

News August 14, 2025

విశాఖ: రెండు రోజుల పాటు మాంసం విక్రయాలు బంద్

image

విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని మాంసం, చేపలు, చికెన్ దుకాణాలకు సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి. నరేశ్ కుమార్ గురువారం తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ ఆదేశాల మేరకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం, కృష్ణాష్టమి సందర్భంగా శనివారం అన్ని మాంసం దుకాణాలను, జంతు వధశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని వ్యాపారులు గమనించాలని ఆయన సూచించారు.

News August 14, 2025

భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

image

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా కలెక్టర్ హరేంధీర ప్రసాద్ గురువారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా నియంత్రించాలని కోరారు. తాగునీరు కలుషితం కాకుండా లీకేజీలు సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

News August 13, 2025

సాగర్ నగర్ బీచ్ సమీపంలో అపస్మారక స్థితిలో వ్యక్తి

image

ఆరిలోవ స్టేషన్ పరిధి సాగర్ నగర్ రాడిసన్ బ్లూ హోటల్ సమీపంలో బీచ్ దగ్గర పొదల్లో ఓ వ్యక్తి అపస్మారకస్థితిలో పడి ఉన్నట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. స్థానికులు 108 సమాచారం ఇవ్వగా కేజీహెచ్‌కి తరలించినట్లు వెల్లడించారు. ఆ వ్యక్తి పాయిజన్ తీసుకున్నట్లు అనుమానిస్తున్నామన్నారు. ఈ వ్యక్తి బంధువులు ఎవరైనా ఉంటే ఆరిలోవ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సిఐ మల్లేశ్వరరావు సూచించారు.