News August 17, 2025
విశాఖ జిల్లాలో 358 మి.మీ వర్షపాతం నమోదు

గడిచిన 24 గంటల్లో విశాఖ జిల్లాలో 358.8 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా మహారాణిపేట మండల పరిధిలో 66.6 మి.మీ, అత్యల్పంగా ములగాడలో 14.4 మి.మీ. వర్షపాతం నమోదయింది. సీతమ్మధారలో 49.8 మి.మీ, పద్మనాభం-46.8 మి.మీ, పెందుర్తి-43.4 మీ.మీ, భీముని పట్నం-40.6 మి.మీ, ఆనందపురం-21.2మి.మీ, పెదగంట్యాడ-20 మి.మీ, గోపాలపట్నం-19.4 మి.మీ, విశాఖ రూరల్ 19.2 మి.మీ, గాజువాక మండల పరిధిలో 14.6 మి.మీ వర్షపాతం నమోదయింది.
Similar News
News August 17, 2025
సింహాచలంలో 22న ఆర్జిత సేవలు రద్దు

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి వారి దేవాలయంలో 22వ తేదీన ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో వి.త్రినాథ్ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆరోజు సుప్రభాతం, ఆరాధన, లక్ష కుంకుమార్చన సేవలు మినహా మిగతా ఆర్జిత సేవలు అయిన నిత్య కళ్యాణం, గరుడ వాహన సేవ, సహస్రనామార్చన మొదలైన సేవలను రద్దు చేసినట్టు తెలిపారు.
News August 17, 2025
సింహాచలంలో కొండ పైకి ఆ రోజున ఫ్రీ బస్సు సౌకర్యం

సింహాచలం అప్పన్న దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల 22వ తేదీన మహిళలచే సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వి.త్రినాథ్ రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 18వ తేదీన కొండపైన PRO ఆఫీసులో ఆధార్ కార్డు చూపించి తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలా వచ్చిన వారికి వ్రతం రోజు కొండ క్రింద నుండి పైకి, పైనుండి కిందకి ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
News August 17, 2025
విశాఖ: ఐదుకు చేరిన మృతుల సంఖ్య

విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని వెల్డింగ్ దుకాణంలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఘటన జరిగిన రోజే ముగ్గురు మరణించగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో నిన్న గంగారావు మరణించగా.. ఈరోజు ఎల్లాజీ కన్నుమూశాడు. మరొకరు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది.