News January 18, 2026

విశాఖ జిల్లా ఆర్టీసీ ఆదాయం రూ.కోటి ఇరువై లక్షలు

image

సంక్రాంతి పండుగలు ముగించుకొని విశాఖ నుంచి తిరిగి వెళుతున్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ద్వారకా బస్సు కాంప్లెక్స్‌లో రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు ఆదివారం పర్యవేక్షణ చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్ సర్వీసుల సంఖ్య పెంచినట్టు ఆయన పేర్కొన్నారు. పండుగ నాలుగు రోజుల్లో విశాఖ జిల్లాకు ఆర్టీసీ ద్వారా రూ. కోటి ఇరువై లక్షలు ఆదాయం సమకూరినట్టు తెలిపారు.

Similar News

News February 15, 2026

మెరుగైన ర్యాంకు కోసం GVMC కసరత్తు

image

స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 సర్వే నేపథ్యంలో నగర ర్యాంకు మెరుగుదలపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే నెల ఢిల్లీ బృందం పరిశీలనకు రానుంది. దీంతో జీవీఎంసీ పర్యవేక్షణను పెంచి సిబ్బంది పనితీరును సమీక్షిస్తోంది. పారిశుద్ధ్య లోపాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అవగాహన కార్యక్రమాలతో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ, మెరుగైన ర్యాంకే లక్ష్యంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

News February 15, 2026

రుషికొండ బీచ్‌లో బీటెక్ విద్యార్థి మృతి

image

రుషికొండ బీచ్‌లో మునిగి యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విశాఖలో బీటెక్ చదువుతున్న అరవింద్( 21) తన స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. అక్కడ స్నానం చేస్తుండగా.. అరవింద్‌తో పాటు రాజీవ్ సముద్రంలో కొట్టుకొనిపోయారు. వెంటనే స్పందించిన లైఫ్ గార్డ్స్ వారిని ఒడ్డుకి తీసుకొచ్చారు. అప్పటికే అరవింద్ చనిపోయాడు. రాజీవ్‌‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.

News February 15, 2026

సోమవారం జీవీఎంసీలో పీజీఆర్ఎస్ రద్దు: కమిషనర్

image

విశాఖలో ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి, IFR-2026 కార్యక్రమం ఏర్పాట్లు, సమన్వయ సమావేశాలలో సంబంధిత అధికారిక కార్యక్రమాలలో జీవీఎంసీ అధికారులు పాల్గొనున్నారు. ఈ మేరకు సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, అన్ని జోనల్ కార్యాలయాలలో నిర్వహించాల్సిన PGRSను రద్దు చేసినట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.