News February 10, 2026

విశాఖ: జీవీఎంసీ కౌన్సిల్ చివరి సమావేశం 28న

image

జీవీఎంసీ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 28న నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు నిర్ణయించారు. అజెండా సిద్ధం చేసి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం వచ్చేనెల 17తో ముగియనుండటంతో, ఈ సమావేశమే చివరిదిగా నిలవనుంది. ప్రతి సభ్యుడు మాట్లాడేలా వరుసగా రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతో అజెండాలో భారీగా అంశాలు చేర్చే అవకాశముందని అధికారులు తెలిపారు.

Similar News

News February 10, 2026

విశాఖ సీపీని కలిసిన సింహాచలం ఈవో

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చిని, జీవీఎంసీ కమిషనర్ కేతాన్ గార్గ్‌ను సింహాచలం ఈవో వెంకటరావు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా రానున్న చందనోత్సవ వేడుకలపై వీరు చర్చించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈవోకు జీవీఎంసీ కమిషనర్, పోలీస్ కమిషనర్ సూచించారు.

News February 10, 2026

తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తిలో విశాఖ అగ్రస్థానం

image

విశాఖ జిల్లా తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో జరిగిన సమీక్షలో జిల్లాల పనితీరును పరిశీలించారు. 2025-26లో విశాఖ స్థూల ఉత్పత్తి రూ.1.60 లక్షల కోట్లు, తలసరి ఆదాయం రూ.6.58 లక్షలుగా నమోదైంది. గాజువాక నియోజకవర్గానికి ఏ+ గ్రేడ్‌ లభించింది. విశాఖలో రిజిస్ట్రేషన్‌ కేంద్రం, ఎమ్యూజ్‌మెంట్‌ పార్కు ఏర్పాటుపై సూచనలు చేశారు.

News February 10, 2026

విశాఖ ఉక్కులో థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టెండర్లు

image

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా మరో కీలక అడుగు పడింది. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణతో పాటు కోల్ హ్యాండ్లింగ్ పనులను ప్రైవేటుకు అప్పగించేందుకు ఆర్ఐఎన్ఎల్ టెండర్లు ఆహ్వానించింది. క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌ను రెండేళ్లకు రూ.83.52 కోట్లతో నిర్వహించనుంది. అధిక విద్యుత్ వ్యయంతో ఈపీడీసీఎల్‌పై ఆధారపడుతున్న ప్లాంట్ నెలకు రూ.80-90 కోట్లు చెల్లిస్తోంది. దీనిపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.