News April 4, 2025
విశాఖ జూలో కాంట్రాక్ట్ పశువైద్యుని పోస్టుకు నోటిఫికేషన్

విశాఖలో ఇందిరా గాంధీ జూపార్క్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పశువైద్యుని పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు క్యూరేటర్ మంగమ్మ శుక్రవారం తెలిపారు. క్లినికల్ డిసిప్లిన్ సబ్జెక్టులలో మాస్టర్స్ చేసిన వారు అర్హులన్నారు. అనుభవం ఆధారంగా రూ.35,000 నెలవారీ వేతనంతో నియమిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు రెజ్యూమ్‌ను విద్యా అర్హతలతో “పోస్ట్” ద్వారా ఏప్రిల్ 20లోపు ఇందిరా గాంధీ జూ పార్క్‌కు పంపాలన్నారు.
Similar News
News April 5, 2025
అప్పన్న స్వామి దర్శన వేళలో మార్పులు ఇవే..

ఈ నెల 8వతేదీ సింహద్రి అప్పన్న స్వామి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం నేపథ్యంలో ఈనెల 7 నుంచి 24వరకు దర్శన వేళ్లలో మార్పులు చేశారు. ఈ రోజుల్లో అర్జీత సేవలు ఉండవని అర్చకులు టి.పి.రాజగోపాల్ తెలిపారు. 7వ తేదీ నుంచి 14 వరకు సుప్రభాత సేవ, ఉదయం, రాత్రి ఆరాధన సేవల్లో భాగస్వామ్యం ఉండదన్నారు. అలాగే రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు దర్శనాలు ఉండవు. 10వ తేదీన ఉదయం 8గంటల తర్వాత సర్వ దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
News April 5, 2025
విశాఖ నుంచి బయలుదేరే రైళ్లకు గమ్యం కుదింపు

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లకు బచేలి కిరండోల్ సెక్షన్‌లో ట్రాక్ నిర్వహణ పనుల నిమిత్తం గమ్యం కుదించినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. విశాఖ – కిరండోల్ పాసెంజర్(58501/02),విశాఖ-కిరండోల్ నైట్ ఎక్స్ ప్రెస్(18515/16) ఏప్రిల్ 5 నుంచి 14వరకు దంతేవాడ వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో కిరండోల్‌కు బదులుగా దంతేవాడ నుంచి బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.