News January 1, 2025
విశాఖ జైల్లో బయటపడిన ఫోన్లు అతనివేనా?
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ మాజీ MP ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ కేసులో కీలక ముద్దాయి కోలా హేమంత్ కుమార్ కదలికలపై జైలు అధికారులు నిఘా పెట్టారు. ఈ మేరకు సెంట్రల్ జైలులో అతని వద్ద 3సెల్ ఫోన్లు గుర్తించినట్లు తెలుస్తోంది. జైల్లో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఫోన్లు బయటపడటం చర్చనీయాంశమైంది. ఎవరు లోపలికి తీసుకొచ్చారు, ఎన్ని రోజులుగా వాడుతున్నారనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Similar News
News January 4, 2025
విశాఖ: ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
విశాఖ కలెక్టరేట్ లో జిల్లా ఇంచార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈనెల 8న ప్రధాని విశాఖలో పర్యటించి అనకాపల్లి, విశాఖ జిల్లాలో పలు ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.
News January 4, 2025
ప్రధాని పర్యటనపై సీఎస్ సమీక్ష
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన విశాఖ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అమరావతి నుంచి అనకాపల్లి విశాఖ, కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సమీక్షించారు. ప్రధాని పర్యటనకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలను బస్సులు ఇతర వాహనాల్లో సురక్షితంగా తీసుకువచ్చి తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. వాహనాల ట్రాఫిక్ పార్కింగ్‌పై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు.
News January 3, 2025
విశాఖలో ప్రధాని సభకు లక్ష మంది..!
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రానున్న తరుణంలో ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్‌లో ప్రధానమంత్రి సభకు దాదాపు లక్ష మంది ప్రజలు వస్తారని అంచనా వేశారు. తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు, చెట్లు ట్రిమ్మింగ్, గ్రౌండ్ ఎత్తు పల్లాలు లేకుండా చదును చేయాలన్నారు. ప్రధాని పర్యటనలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.