News April 2, 2025
విశాఖ: టీచర్ల సమస్యలపై ప్రభుత్వ విప్‌కు వినతి

రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవి రావుని మంగళవారం ఏపీటీఎఫ్ యూనియన్ నేతలు కలిసి వినతి పత్రం అందజేశారు. విశాఖలోని ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కార్యాలయంలో సమావేశమైన యూనియన్ నాయకులు, ఉపాధ్యాయుల జీత భత్యాలు, పదోన్నతులు, బదిలీలతో పాటు ఇతర సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
Similar News
News December 15, 2025
నేడు GVMCలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

విశాఖలోని GVMC ప్రధాన కార్యాలయం, అన్ని జోనల్ కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాలు, టౌన్ ప్లానింగ్ వంటి సమస్యలపై ప్రజలు నేరుగా అర్జీలు సమర్పించవచ్చు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సూచించారు.
News December 14, 2025
విశాఖ: ఆర్టీసీలో నెల రోజుల పాటు డోర్ డెలివరీ మాసోత్సవాలు

ఆర్టీసీలో నెలరోజుల పాటు డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. ఈనెల 20 నుంచి జనవరి 19వ తేదీ వరకు 48 గంటల్లోనే కస్టమర్లకు పార్సెల్ డెలివరీ చేస్తామన్నారు. విశాఖలో 84 కౌంటర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తక్కువ రేట్లకే కస్టమర్ వద్దకు పార్సెల్స్ చేరుతాయని, ఆర్టీసీకి అదనంగా ఆదాయం చేకూర్చే విధంగా సిబ్బందితో కార్గోపై ప్రచారం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
News December 14, 2025
ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో నాగబాబు ప్రత్యేక భేటీ

ఉత్తరాంధ్ర జనసేన ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎచ్చెర్లలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం భేటీ అయ్యారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలోపేతం కోసం సమిష్టిగా చేపట్టే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ప్రజలకు అందుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు.


