News April 10, 2024
విశాఖ: టీడీపీలో చేరిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్

విశాఖపట్నంకు చెందిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ మంగళవారం టీడీపీలో చేరారు. ఈ మేరకు ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని అన్నారు. ఇటీవల సుధాకర్ వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Similar News
News October 5, 2025
ఎన్‌ఏడీలో తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు..!

విశాఖలోని అత్యంత రద్దీ ప్రాంతమైన ఎన్‌ఏడీ జంక్షన్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పనులు వేగవంతమయ్యాయి. ఎన్‌ఏడీ నుంచి కాకానినగర్ వరకు 11 మీటర్ల వెడల్పుతో తేలికపాటి వాహనాల కోసం నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2025 చివరి నాటికి దీనిని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గాజువాక వైపు వెళ్లే వాహనదారుల ప్రయాణం సులభతరం కానుంది.
News October 5, 2025
ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలి: కలెక్టర్

విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద 46 కేసుల్లో బాధితులకు రూ.79 లక్షల పరిహారం అందించామని, పెండింగ్ కేసులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మాన్యువల్ స్కావెంజర్ల కుటుంబాలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి పరచాలని అధికారులకు సూచించారు.
News October 5, 2025
విశాఖలో పర్యటించనున్న కేంద్ర మంత్రి

కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ సోమవారం విశాఖలో పర్యటించనున్నారు. 5న రాత్రి విశాఖ చేరుకొని హోటల్లో బస చేస్తారు. 6న ఉదయం 10 గంటలకు పోర్టు ఎల్పీజీ బెర్త్ వద్ద శివాలిక్ నౌకను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు సాగరమాల కన్వెన్షన్‌లో విశాఖ పోర్టు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. సాయంత్రం 6.15కి విశాఖ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.