News March 27, 2024
విశాఖ: టైగర్ ట్రయాంఫ్ విన్యాసాలు

భారత్, యూఎస్‌ల ఆధ్వర్యంలో టైగర్ ట్రయాంఫ్–2024 సీఫేజ్ విన్యాసాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు బుధవారం విశాఖ సముద్ర తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో విన్యాసాలు నిర్వహించారు. విపత్తు నిర్వహణ, మానవతా సహాయం పేరుతో రెండో రోజు విన్యాసాలు సాగాయి. భారత్‌కు ఐఎన్‌ఎస్ జలశ్వా ప్రాతినిధ్యం వహించగా, యూఎస్‌కు యూఎస్‌ఎస్ సోమర్‌సెట్, యూఎస్‌ఎస్ హాల్‌సే యుద్ధ నౌకలు పాల్గొన్నాయి.
Similar News
News February 11, 2026
దేశ ఇంధన భద్రతలో కీలక కేంద్రంగా విశాఖ

విశాఖ దేశ ఇంధన భద్రతకు కీలక వ్యూహాత్మక కేంద్రంగా ఎదిగింది. భారత్ పెట్రోలియం నిల్వలను విశాఖ, మంగళూరు, పడూర్ ప్రాంతాల్లో భూగర్భ గుహల్లో ఏర్పాటు చేసింది. ఈ నిల్వలు రిఫైనరీల స్టాక్‌తో కలిపి దేశ అవసరాలను 74 రోజులు తీర్చగలవని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి పార్లమెంట్‌లో చెప్పారు. తూర్పు తీరంలో విశాఖ నిల్వ సదుపాయం ఇంధన సరఫరా స్థిరత్వానికి బలోపేతం చేస్తూ జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తోంది.
News February 11, 2026
మిలాన్ వేడుకల నేపథ్యంలో విశాఖ అంతటా నిఘా

మిలాన్, ఐ.ఎఫ్.ఆర్ వేడుకల నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అన్ని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అంతర్జాతీయ ప్రతినిధుల రాక దృష్ట్యా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరాన్ని హై అలర్ట్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
News February 11, 2026
జీవీఎంసీలో డీసీపీలకు జోన్‌ల కేటాయింపు

జీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ డీసీపీలకు జోన్లు వారిగా విధులు కేటాయిస్తూ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు.
➣టి.జి.రామ్మోహన్‌కు పెందుర్తి, వెస్ట్ జోన్
➣కె.హరిదాస్ ఈస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్
➣సిహెచ్.మధుసూదన్ రావు గాజువాక, అగనంపూడి, అనకాపల్లి జోన్
➣కే.వెంకటేశ్వరరావుకు భీమిలి, మధురవాడ జోన్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


