News June 29, 2024

విశాఖ: టోల్ ఛార్జీ వసూళ్లను నిలిపివేసిన ఆర్టీసీ

image

విశాఖ జిల్లా అగనంపూడి వద్ద టోల్ గేట్ ఎత్తివేయడంతో ఆ రూట్‌లో ప్రయాణించే ప్రయాణికుల నుంచి ఆర్టీసీ టోల్ ఛార్జీల వసూళ్లకు నిలిపివేసింది. విశాఖ ఆర్టీసీ రీజియన్ శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖ నుంచి అనకాపల్లి, రాజమండ్రి, నర్సీపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సు ప్రయాణికుల నుంచి ఆర్టీసీ రూ.5 నుంచి రూ.10 వరకు టోల్ ఛార్జీలు వసూలు చేసేది. ఈ మేరకు టికెట్ ఇష్యూ మెషీన్‌లో సాఫ్ట్‌వేర్‌ను సవరించారు.

Similar News

News July 1, 2024

విశాఖ సీపీగా బాధ్యతలు స్వీకరించిన శంకబ్రత బాగ్చీ

image

విశాఖ సీపీగా శంకబ్రత బాగ్చీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వైజాగ్‌లో పని చెయ్యడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. తనకు ఇక్కడ పని చెయ్యడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు పెళ్లి అయ్యాక హనీమూన్ ఎక్కడకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నప్పుడు అందరూ స్విట్జర్లాండ్ వెళ్లాలన్నారు కానీ.. అప్పుడు డబ్బులు లేకపోవడంతో విశాఖనే ఎంచుకున్నాని తెలిపారు.

News July 1, 2024

విశాఖ నగరానికి తలమానికంగా క్లాక్ టవర్

image

విశాఖ మహా నగరానికి జగదాంబ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన క్లాక్ టవర్ తలమానికంగా నిలిచింది. నగరాభివృద్ధిలో భాగంగా అధికారులు సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో నగరంలోని అతి ముఖ్యమైన జగదాంబ సెంటర్‌లో క్లాక్ టవర్‌ను నూతనంగా నిర్మించారు. ఈ టవర్ చుట్టూ విద్యుత్ దీపాలను అందంగా అలంకరించారు. ఈ క్లాక్ టవర్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

News July 1, 2024

తగ్గుముఖం పట్టిన పర్యాటకుల తాకిడి

image

ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు పర్యాటకుల తాకిడి తగ్గింది. గతవారం రోజులుగా బొర్రాను సందర్శించేవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ ఆదివారం 1,700 మంది సందర్శించగా రూ.1.57 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు. తాటిగూడ, కటికి, డముకు వ్యూపాయింట్ తదితర సందర్శిత ప్రాంతాలన్నీ ఈవారం వెలవెలబోయాయి. వేసవిసెలవులు ముగియడంతో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. దీంతో పర్యాటకుల సంఖ్య తగ్గుతుంది.