News February 23, 2026
విశాఖ: ట్రైన్‌లో బంగారం ఉన్న బ్యాగ్ చోరీ

విశాఖ నుంచి ఆగ్రాకు వెళ్తున్న మహిళ బ్యాగ్ రైల్వే స్టేషన్లో మిస్ అయింది. బ్యాగ్‌లో 200 గ్రాముల బంగారం, రూ.12,500 ఉన్నట్టు ఆమె సీపీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సీపీ ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించగా సీసీ కెమెరాలను పరిశీలించి హర్యానాకు చెందిన వ్యక్తి బ్యాగును దొంగలించి ట్రైన్‌లో వెళ్లిపోయినట్టు గమనించారు. ఆర్పీఎఫ్ పోలీసులు అతడిని అరెస్టు చేసి బ్యాగు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News February 25, 2026
TU: ప్రశాంతంగా ఎల్ఎల్‌బీ పరీక్షలు

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రధాన ప్రాంగణంలో ఎల్ఎల్‌బీ ఐదో సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 28 మంది విద్యార్థులకు 28 మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పరీక్షలను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారులు పర్యవేక్షించారు.
News February 25, 2026
‘పార్వతీపురం జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ పూర్తి సహకారం అందించాలి’

మన్యం జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి కోరారు. నీతి ఆయోగ్ అధికార ప్రతినిధి ఆయుషి అగర్వాల్ బుధవారం జిల్లాలో పర్యటించారు. 2047 నాటికి గ్రామాలను స్వయం సమృద్ధిగా, అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు రూపొందించిన విలేజ్ ప్లాన్-2047 అమలు చేయాలని అన్నారు. మన్యం జిల్లాలోని ప్రతి గ్రామం అన్ని రంగాల్లో వృద్ధి సాధించేలా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలన్నారు.
News February 25, 2026
మైనార్టీ వెబ్‌సైట్‌లో ‘నిర్మల్’ మాయం.. దరఖాస్తుదారుల ఆందోళన

మైనార్టీలకు సబ్సిడీ ద్విచక్ర వాహనాల పంపిణీకి ప్రభుత్వం దరఖాస్తులు కోరగా సంబంధిత OBMMS వెబ్‌సైట్‌లో నిర్మల్ జిల్లా పేరు కనిపించకపోవడం గందరగోళానికి దారితీస్తోంది. మార్చి 1 వరకు గడువు ఉన్నప్పటికీ, జిల్లా ఆప్షన్ లేక దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖను వివరణ కోరగా వెబ్‌సైట్‌లోనే సాంకేతిక లోపం ఉందన్నారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


