News September 2, 2024

విశాఖ: ట్రైన్ టికెట్ రీఫండ్‌కు హెల్ప్‌డెస్క్

image

వాల్తేరు డివిజన్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రద్దు చేశారు. ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరింత సమాచారం కోసం విశాఖపట్నంలో 0891-2746330, 0891-2744619.. విజయనగరంలో 8712641260, 08922 221202 నెంబర్లతో హెల్ప్‌డెస్క్‌లను అందుబాటులోకి తెచ్చారు.

Similar News

News November 12, 2025

న్యుమోనియా లక్షణాలు ఇవే: DMHO

image

నేటి నుంచి ఫిబ్రవరి 28వరకు అన్ని ఆరోగ్య కేంద్రాలలో సాన్స్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు DMHO జగదీశ్వరరావు తెలిపారు. ఈ సాన్స్ ప్రోగ్రాం ద్వారా పిల్లలలో న్యుమోనియా లక్షణాలు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రతలు, వైద్యం గూర్చి నిర్వహించనున్నారు. దగ్గు, జలుబు ఎక్కువ రావటం, అధిక జ్వరం, శ్వాస తీసుకొనే సమయంలో డొక్కలు ఎగురవేయటం లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.

News November 12, 2025

ఉపరాష్ట్రపతి విశాఖ పర్యటన వివరాలు

image

ఈనెల 14న ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ విశాఖ రానున్నారు. ఆరోజు ఉదయం 8.30 ఎయిర్ పోర్టు నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సీఎం చంద్రబాబుతో కలసి ఇంజినీరింగ్ గ్రౌండ్‌లో అల్పాహార విందులో పాల్గొంటారు. ఉదయం 8.55కు 30వ సిఐఐ పార్ట్ నర్షిప్ సమ్మిట్‌లో పాల్గొంటారు. అదే రోజున ఉదయం 11.15కు ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఈ మేరకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి ఏర్పాట్లు చేస్తున్నారు.

News November 12, 2025

విశాఖలో మరో ఐటీ క్యాంపస్‌‌ ఏర్పాటు

image

విశాఖలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కానుంది. కాపులుప్పాడలో రూ.115 కోట్లతో.. 2,000 మందికి ఉద్యోగాలిచ్చే విధంగా క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ లిమిటెడ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇంజినీరింగ్, AIML, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీతో క్యాంపస్ నిర్మించనున్నారు. ఎకరం రూ.కోటి చొప్పున, 4 ఎకరాలు భూమిని ప్రభుత్వం కేటాయించింది. రెండేళ్లలో తొలి దశ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశాలిచ్చింది.