News March 24, 2024
విశాఖ: ‘డాక్యుమెంట్లు లేని రూ.2లక్షలు స్వాధీనం’

నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.2లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ విజయ్ కుమార్ తెలిపారు. గాజువాక కణిత రోడ్‌కు చెందిన గంగుమల్ల ప్రమోద్ పాయకరావుపేట నుంచి యలమంచిలి వైపు ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా నగదు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు.
Similar News
News September 27, 2025
విశాఖ: హోమ్ స్టే నిర్వహకులతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు

సిరిపురం వద్ద పర్యాటకుల కోసం ప్రత్యేకంగా హోం స్టే నిర్వహిస్తున్న రేణు గుప్తాతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఆమె వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. పర్యాటకుల సంతృప్తి, అభిప్రాయాలపై ఆరా తీశారు. పర్యాటకులకు వంటలేమైనా వండి పెడతారా.. వారితో మమేకం అవుతారా.. నగర విశేషాలను చెబుతారా అని అడిగి తెలుసుకున్నారు.
News September 27, 2025
అక్టోబర్ 3 నుంచి పాఠశాలల క్రీడా పోటీలు: DEO

పాఠశాలల్లో అక్టోబర్ 3 నుంచి 30వ తేదీ వరకు క్రీడా పోటీలు జరుగుతాయని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. 56 క్రీడలకు సంబంధించి పోటీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో చదువుతున్న క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనాలని ఆయన కోరారు. అండర్-11లో 3 నుంచి 5వ తరగతి, అండర్-14, 17 కింద 6వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు.
News September 27, 2025
విశాఖలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రూజ్ కలనరీ అకాడమీ (సీసీఎ) ఆధ్వర్యంలో ఆర్కేబీచ్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏపీ పర్యాటక జిల్లా అధికారి మాధవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ టూరిజం హబ్‌గా మారనుందని ఆమె పేర్కొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని సంస్థ డైరెక్టర్లు పేర్కొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.