News July 11, 2024

విశాఖ: డిగ్రీలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ గడువు పెంపు

image

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. 18 నుంచి 20 వరకు స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తారు. 23 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్‌లో మార్పులు చేసుకోవడానికి 27వ తేదీన అవకాశం కల్పిస్తారు. ఈ నెల 31న తొలి దశ సీట్ల కేటాయిస్తారు. >Share it

Similar News

News September 30, 2024

సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం రూ.1.39 కోట్లు

image

సింహాచలం సింహాద్రి అప్పన్న హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. హుండీల ద్వారా 28 రోజులకు రూ.1,39,44,045 నగదు లభించింది. భక్తులు కానుకల రూపంలో వేసిన బంగారం 53 గ్రాముల 200 మి. గ్రాములు, వెండి 8 కిలోల 650 గ్రాముల 500 మి.గ్రా. లభించింది. అలాగే యూఎస్ఏ డాలర్లు 77, కెనడా డాలర్లు 20, సింగపూర్ డాలర్లు 30, యూఏఈ దిరమ్స్ 130తో పాటు వివిధ దేశాల కరెన్సీ లభించింది.

News September 30, 2024

AU: అక్టోబర్ 1న బి.ఆర్క్ స్పెషల్ ఎగ్జామినేషన్

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అయిదవ సంవత్సరం రెండవ సెమిస్టర్ స్పెషల్ ఎగ్జామినేషన్ అక్టోబర్ 1వ తేదీన నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్టర్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందన్నారు. 2019- 20 నుంచి ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని వివరించారు.

News September 30, 2024

హుకుంపేట: ‘2 రోజులు మా గ్రామానికి రావొద్దు’

image

హుకుంపేట మండలంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో మండలంలోని దాలిగుమ్మడి గ్రామస్థులు ముందు జాగ్రత్త చర్యలకు దిగారు. సోమ, మంగళవారం బయటి వ్యక్తులెవరూ గ్రామంలోకి రావొద్దని బారికేడ్ ఏర్పాటు చేశారు. గ్రామానికి వైరల్ జ్వరాలు, ఇతర జబ్బులు రాకుండా ఉండేందుకు  అ 2రోజులు పాటు అమ్మోరు పండుగ జరుపుకుంటామని వారు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి బయటి వ్యక్తులను అనుమతిస్తామన్నారు.