News July 5, 2024

విశాఖ: డీసీఐకి రూ.156.5 కోట్లతో ఒప్పందం

image

ప్రతిష్ఠాత్మకమైన కొచ్చిన్ పోర్టు అథారిటీ‌తో రూ. 156.50 కోట్ల విలువైన డ్రెడ్జింగ్ ఒప్పందం కుదిరినట్లు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఛైర్మెన్ అంగముత్తు తెలిపారు. డ్రెడ్జింగ్ పరిశ్రమల్లో డీసీఐ అగ్రగామిగా ఉందన్నారు. భారీస్థాయి డ్రెడ్జింగ్ ప్రాజెక్టులను అమలు చేయడంలో మంచి రికార్డు ఉందని వెల్లడించారు. ఈ ఒప్పందం డీసీఐ ప్రతిష్ఠను మరింత పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News

News July 8, 2024

అనకాపల్లి: ప్రాణాలు తీసిన ఫొటోల సరదా

image

మాడుగుల మండలం తాచేరు ప్రాంతంలో ఫొటోలు దిగేందుకు వచ్చిన గుర్రం చందుమోహన్, గుబ్బల జ్ఞానేశ్వర్ అనే బావ బామ్మర్దులు నీటిలో మునిగి చనిపోయినట్లు ఎస్సై దామోదర్ నాయుడు తెలిపారు. తాచేరులో రాయిపై చందుమోహన్ నిల్చుని ఫొటో తీసుకుంటూ నీటిలో పడిపోగా.. అతనిని రక్షించేందుకు జ్ఞానేశ్వర్ నీటిలో దూకాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మరణించినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు.

News July 8, 2024

అనకాపల్లి: హత్యకు ముందు లేఖ రాసిన నిందితుడు

image

రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో బాలిక హత్య కేసులో నిందితుడు సురేశ్ ఆచూకీ ఇంకా దొరకలేదు. హోం మంత్రి ఆదేశాల మేరకు 12 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వ్యసనాలకు బానిసైన సురేశ్.. సైకో మాదిరిగా ప్రవర్తిస్తుంటాడని అతని పరిచయస్థులు తెలిపారు. తాను ఎందుకు హత్యచేశానో బాలిక అన్నయ్యకు ఓ లేఖను రాసి దాన్ని సంఘటనా స్థలం వద్దే ఉంచాడు. నిందితుడు ఫోన్ వాడకపోవడంతో పోలీసులకు సవాల్‌గా మారింది.

News July 8, 2024

విశాఖ: ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్‌లో సరికొత్త ఫీచర్లు

image

విద్యుత్ బిల్లులు చెల్లింపుల కోసం ఏపీ ఈపీడీసీఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్‌లో సరికొత్త ఫీచర్లు జత చేసినట్లు సంస్థ సీఎండి పృథ్వీతేజ్ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుడు సర్వీస్‌కు సంబంధించిన విద్యుత్ వినియోగం, బిల్లు వివరాలు, బిల్లు చెల్లింపు, విద్యుత్ సరఫరా పరిస్థితి వివరాలు తెలుసుకునేలా సరికొత్త ఫీచర్లు తీసుకువచ్చినట్లు తెలిపారు.