News September 25, 2025

విశాఖ డెయిరీ లాభం ఎంతంటే?

image

విశాఖ డెయిరీ ఏడాది టర్నోవర్ రూ.1755 కోట్లు ఉండగా.. 2024-25లో రూ.8.51 కోట్ల నికర లాభం వచ్చిందని ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ వెల్లడించారు. ‘19.28కోట్ల లీటర్ల పాలు, 5.84 కోట్ల కేజీల పెరుగు విక్రయించాం. ఉత్తరాంధ్ర, తూ.గో, ప.గో జిల్లాలో 3లక్షల మంది నుంచి పాలు సేకరిస్తున్నాం. 2025-26లో రూ.2వేల కోట్ల టర్నోవర్, రూ.20కోట్ల లాభం వచ్చేలా వ్యాపారాన్ని విస్తరిస్తాం’ అని వార్షిక సమావేశంలో ఛైర్మన్ పేర్కొన్నారు.

Similar News

News September 27, 2025

జి. సిగడాం: రైలు ప్రమాదంలో ఒకరు మృతి

image

రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జి. సిగడాంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. మృతదేహం రైల్వే స్టేషన్ సిగ్నల్ పాయింట్ వద్ద పడి ఉండగా స్థానికుల సమాచారంతో రైల్వే హెడ్ కానిస్టేబుల్ మధుసూదన్ రావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడికి (23) ఏళ్లు ఉంటాయని, ఆరెంజ్ కలర్ చొక్కా ధరించాడని తెలిపారు. వివరాలు తెలిసిన వారు 91103 05494 నంబర్‌కు సంప్రదించాలని హెడ్ కానిస్టేబుల్ చెప్పారు.

News September 27, 2025

వైసీపీ డిజిటల్ బుక్ లాంచింగ్ చేసిన తమ్మినేని

image

వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు డిజిటల్ బుక్ ప్రవేశపెట్టడం జరుగుతుందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డిజిటల్ బుక్ లాంచింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. వైసీపీ నాయకులపై చేస్తున్న అక్రమాలపై బుక్‌లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని వివరించారు.

News September 27, 2025

శ్రీకాకుళం జిల్లాకు తుఫాన్ అలెర్ట్

image

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 29 వరకు తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. భారత వాతావరణశాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి శనివారం ఒడిశా – ఉత్తరాంధ్ర మద్య తీరం దాటుతుందన్నారు. గ్రామ స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని, చెట్లు కింద ఉండరాదన్నారు.