News August 1, 2024
విశాఖ: తనికెళ్ల భరణికి జీవన సాఫల్య పురస్కారం

రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణికి రంగసాయి జీవన సాఫల్య పురస్కారం లభించింది. గురువారం విశాఖ కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు ఆయనకు పురస్కారాన్ని అందజేయడంతో పాటు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నటుడు బాదంగీర్, దర్శకుడు భాష, యువ నటుడు సతీశ్ కుమార్, బుద్దాల వెంకట రామారావు, మంగాదేవి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 9, 2025
‘ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’

VMRDAకి చెందిన అన్ని కళ్యాణ మండపాల బుకింగ్‌లు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. బుధవారం VMRDA బాలల థియేటర్లో ఆయన ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించారు. ప్రజలకు VMRDA సేవలు పారదర్శకంగా కల్పించేందుకు ఆన్లైన్ సేవలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆన్లైన్‌లోనే కళ్యాణమండపం రుసుము, తదితర వివరాలు ఉంటాయని పేర్కొన్నారు.
News July 9, 2025
ద్వారకానగర్: పిల్లలకు సెలవు.. పేరెంట్స్ వెళితే గేట్లకు సీల్

ద్వారకానగర్‌లోని రవీంద్ర భారతీ స్కూల్ 3 రోజులుగా తెరవలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టగా అసలు నిజం బయటపడింది. సిబ్బందికి ESI కల్పించకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. వీటికి స్పందన లేకపోవడంతో స్కూల్‌కు సీల్ వేశారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే మేనేజ్‌మెంట్ పిల్లలకు సెలవు ప్రకటించిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న DEO ప్రేమ్ కుమార్ ESI అధికారులతో మాట్లాడారు.
News July 9, 2025
సీఎంను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సీఎం చంద్రబాబును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించి, శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం.