News February 20, 2025

విశాఖ: త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై క‌ఠిన‌ చ‌ర్య‌లు

image

గ్రూప్-2 ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని క‌లెక్ట‌ర్ హరేంద్ర ప్రసాద్ హెచ్చ‌రించారు. గురువారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు. మాస్ కాపీయింగ్ లేదా ఇత‌ర సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని పేర్కొంటూ ఎలాంటి ఆధారం లేకుండా త‌ప్పుడు వార్త‌ల‌ను, స‌మాచారాన్ని చేరవేసే వారిపై నిఘా ఉంటుంద‌న్నారు. త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Similar News

News September 15, 2025

విశాఖలో ‘స్వస్త్ నారి-సశక్త్ పరివార్’ అభియాన్

image

విశాఖ జిల్లాలో మహిళల ఆరోగ్యం కోసం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు “స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్” ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ జగదీశ్వరరావు తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్, గర్భిణుల పరీక్షలు, పిల్లలకు టీకాలు వేస్తారన్నారు. సెప్టెంబర్ 17న ప్రధాని వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 15, 2025

విశాఖ పీజీఆర్ఎస్‌కు 329 వినతులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని రెవెన్యూ అధికారి భవానీ శంకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ఆయన ప్రజలు వినతులు స్వీకరించారు. వివిధ స‌మ‌స్య‌ల‌పై మొత్తం 329 విన‌తులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందిన‌వి 92, జీవీఎంసీకి చెందిన‌వి 88, పోలీసు శాఖ‌కు సంబంధించి 25, ఇత‌ర శాఖ‌ల‌కు సంబంధించి 124 ఉన్నాయి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శేషశైలజ ఉన్నారు.

News September 15, 2025

పెద్ద గంట్యాడలో ఉచిత శిక్షణ

image

ఏపీ ప్రభుత్వం స్థాపించిన నేక్ ఆధ్వర్యంలో బ్రాడ్ బాండ్ టెక్నీషియన్ కోర్స్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ సోమవారం తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసి 18-40 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువత అర్హులన్నారు. 3 నెలల శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టార్లో ఉపాధి కల్పిస్తారన్నారు. పెద్ద గంట్యాడ నేక్ సెంటర్లో శిక్షణ అందిస్తామని తెలిపారు.