News March 28, 2024
విశాఖ: తమ్ముడి కోసం అక్క.. భర్తల కోసం భార్యలు

ఉమ్మడి విశాఖలోని అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. విశాఖ తూర్పు TDP అభ్యర్థి వెలగపూడి తరఫున ఆయన భార్య సుజన, పశ్చిమ YCP అభ్యర్థి ఆనంద్ కుమార్ తరఫున ఆయన సోదరి రమాకుమారి, అనకాపల్లి YCP అభ్యర్థి మలసాల భరత్ కుమార్‌కు మద్దతుగా ఆయన భార్య ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అటు బీజేపీ MP అభ్యర్థి సీఎం రమేశ్ సోదరుడు సురేశ్, తనయుడు రితీష్ అనకాపల్లిలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు.
Similar News
News November 6, 2025
విశాఖ: మహిళలను కాపాడిన లైఫ్ గార్డ్స్

RK బీచ్ గోకుల్ పార్క్ వద్ద సముద్రంలో కొట్టుకుపోతున్న మహిళలను లైఫ్ గార్డ్స్ కాపాడారు. గురువారం ఉదయం మహారాణి పేటకు చెందిన కీర్తి ఉషారాణి, సునీత పూజా సామాగ్రిని సముద్రంలో వదలడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు కెరటాల తాకిడికి సముద్రం లోపలికి వెళ్లిపోతుండగా లైఫ్ గార్డ్స్ గమనించి వారిని రక్షించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
News November 6, 2025
విశాఖ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ దళారీ వ్యవస్థ!

విశాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. స్టాంప్ పేపర్ లైసెన్స్ వెండర్లు, డాక్యుమెంట్ రైటర్లుగా తిష్ట వేసి ప్రజలను పీడిస్తున్నారు. పన్నులు, ఫీజులు, TDS చెల్లించినా ఆస్తి విలువను బట్టి 1% వరకు వారికి అదనంగా చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. చలానాలు, ఫీజులు నేరుగా చెల్లించే అవకాశం లేకుండా తమ ఖాతాల్లో జమ చేసుకుంటారు. దళారీ వ్యవస్థను పెకిలించాలని కోరుతున్నారు.
News November 6, 2025
విశాఖ: ఆదాయంలో సూపర్ బజార్ సబ్ రిజిస్ట్రార్ టాప్

ఈ ఆర్థిక సంవత్సరంలో విశాఖలోని 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఆదాయం గణనీయంగా పెరిగింది. మొదటి 7 నెలల్లోనే సుమారు రూ.600 కోట్ల ఆదాయం నమోదైనట్లు సమాచారం. సూపర్ బజార్, మధురవాడ కార్యాలయాలు అత్యధిక ఆదాయం సాధించగా.. అనందపురం, భీమునిపట్నం కార్యాలయాలు తక్కువ ఆదాయంతో చివర్లో నిలిచాయి. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్టు త్వరలో పూర్తి కానుండడంతో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.


