News April 29, 2024

విశాఖ-తిరుపతి స్పెషల్ ట్రైన్ రీ షెడ్యూల్

image

విశాఖ-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ నుంచి సోమవారం రాత్రి 7.10 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్ రాత్రి 11.10 గంటలకు బయలుదేరుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ట్రైన్ కు సంబంధించిన కనెక్షన్ రైలు ఆలస్యంగా వస్తున్న కారణంగా దీనిని రీ షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

Similar News

News February 20, 2026

విశాఖ ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 అమలు

image

విశాఖపట్నం ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ఏపీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు విధించినట్లు ఏసీపీ కె.లక్ష్మణ మూర్తి తెలిపారు. కలెక్టరేట్, జీవీఎంసీ, జగదాంబ వంటి కీలక ప్రాంతాల్లో అనుమతి లేకుండా సభలు, ఊరేగింపులు నిర్వహించరాదన్నారు. ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 20, 2026

కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి

image

కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్‌లో విధులు నిర్వహించేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న బోయన్న (53) జాతీయ రహదారిపై లారీ కింద పడి దుర్మరణం చెందాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.

News February 20, 2026

విశాఖ: వైసీపీ MPTC అరెస్ట్

image

గంజాయి తరలిస్తూ చెక్ పోస్ట్‌ను ఢీకొట్టి పరారైన కేసులో భీమిలి మండలం దాకమర్రి వైసీపీ ఎంపీటీసీ కే.నగేశ్ బాబును కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన ఓ ప్రముఖ నేతకు ఈయన అనుచరుడని సమాచారం. నిందితుడిపై గతంలోనే జగ్గంపేట పీఎస్‌లో కేసు నమోదైంది. గంజాయి స్మగ్లింగ్‌లో అరెస్టవ్వడం స్థానికంగా పెను సంచలనంగా మారింది.