News March 25, 2025
విశాఖ తీరంలో హీట్ పెంచుతున్న మేయర్ పీఠం ..!

విశాఖ తీరంలో GVMC మేయర్ పీఠం హీట్ పెంచుతోంది. మేయర్ పదవి దక్కించుకునేందుకు కూటమి కదుపుతున్న పావులను YCP తిప్పికొట్టేందుకు యత్నిస్తోంది. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి నాయకులు ఇటీవల కలెక్టర్‌కు వినతి ఇవ్వగా.. అలెర్ట్ అయిన వైసీపీ అధిష్ఠానం క్యాంప్ రాజకీయాలకు తెరలేపినట్లు సమాచారం. ఇప్పటికే 28 మంది YCP కార్పొరేటర్లను బెంగళూరు తరలించారు. అక్కడి నుంచి ఊటీ టూర్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
Similar News
News March 28, 2025
అమెరికాలో జనసేన ఆత్మీయ సమావేశం

అమెరికాలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ పాల్గొన్నారు. జనసేన పార్టీ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీగా 100% స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించిందన్నారు. వివిధ రంగాల్లో ఉన్న మేధావులు పార్టీ కోసం కృషి చేశారని కొనియాడారు. ఎన్డీఏ కూటమి బలోపేతానికి ఎన్ఆర్ఐలు సహకారం అందించాలని కోరారు.
News March 28, 2025
కంచరపాలెంలో దారుణం.. ఒకరు మృతి

విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఎస్ఆర్‌ఆర్ నగర్‌కు చెందిన పి.హనుమంతురావు(60) మృతదేహం కలకలం రేపింది. చెట్టుకు నగ్నంగా కట్టేసి కొట్టడంతో అతను చనిపోయినట్లు సమాచారం. స్థానికులు చెట్టుకు కట్టేసి ఉన్న అతని మృతదేహాన్ని కిందకు దించి వస్త్రాలు కప్పారు. వారి సమాచారం మేరకు కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 28, 2025
ఇంట్లో పేకాట.. విశాఖలో 11 మంది అరెస్ట్

హెచ్‌బి కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న వారిని ఎంవీపీ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.22,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. 11 మందిపై కేసు నమోదు చేశారు. నగరంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.