News March 31, 2024
విశాఖ దక్షిణ అభ్యర్థి వంశీకృష్ణ రాజకీయ ప్రస్థానం ఇదే

విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ను ప్రకటించారు. 2009లో ప్రజారాజ్యం తరుఫున పోటీచేసి ఆయన ఓడిపోయారు. 2011లో వైసీపీలో చేరి 2014లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో ఆయనకు టిక్కెట్ రాకపోవడంతో 2021లో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్‌లో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.
Similar News
News March 28, 2025
కంచరపాలెంలో దారుణం.. ఒకరు మృతి

విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఎస్ఆర్‌ఆర్ నగర్‌కు చెందిన పి.హనుమంతురావు(60) మృతదేహం కలకలం రేపింది. చెట్టుకు నగ్నంగా కట్టేసి కొట్టడంతో అతను చనిపోయినట్లు సమాచారం. స్థానికులు చెట్టుకు కట్టేసి ఉన్న అతని మృతదేహాన్ని కిందకు దించి వస్త్రాలు కప్పారు. వారి సమాచారం మేరకు కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 28, 2025
ఇంట్లో పేకాట.. విశాఖలో 11 మంది అరెస్ట్

హెచ్‌బి కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న వారిని ఎంవీపీ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.22,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. 11 మందిపై కేసు నమోదు చేశారు. నగరంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
News March 28, 2025
విశాఖలో నేడు బార్ అసోసియేషన్ ఎన్నికలు

విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఎన్నికలు నేడు జరగనున్నాయి. కీలకమైన అధ్యక్ష పదవికి ఎం.కె. శ్రీనివాస్, అహమ్మద్, సన్నీ యాదవ్ తలపడుతుండగా.. ఉపాధ్యక్ష పదవికి చింతపల్లి ఆనంద్ కుమార్, కె.విజయ్ బాబు బరిలో ఉన్నారు. జనరల్ సెక్రటరీ పదవికి రాపేటి సూర్యనారాయణ, పార్వతి నాయుడు, సుధాకర్ తదితరులు పోటీలో ఉండగా.. కోశాధికారి పదవికి నరేశ్, రాము, శివప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఫలితాలు ఈరోజు రాత్రికి వెలువడే అవకాశం ఉంది.