News October 3, 2024

విశాఖ: దసరాకు ప్రత్యేక బస్ సర్వీసులు

image

దసరా సందర్భంగా విశాఖ నుంచి పలు ప్రాంతాలకు 250 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలరాజు తెలిపారు. ప్రత్యేక సర్వీసులకు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు. హైదరాబాద్‌కు 40, విజయవాడకు 40 నుంచి 50, రాజమండ్రి, కాకినాడ సెక్టార్‌కు 40 అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక సర్వీసులు నడుపుతామన్నారు.

Similar News

News October 7, 2024

‘సెయిల్‌లో స్టీల్ ప్లాంట్‌ విలీనానికి తీర్మానం’

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసినప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెయిల్ సభ్యుడు సాగి విశ్వనాథరాజు అన్నారు. సోమవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సెయిల్‌లో స్టీల్ ప్లాంట్‌ను విలీనం చేస్తే స్టీల్ టన్నుకు రూ.10,000 తగ్గుతుందన్నారు. ఏపీలో ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి సెయిల్‌లో విలీనం చేయాలని తీర్మానించడం జరిగిందన్నారు.

News October 7, 2024

విశాఖలో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

పీఎం పాలెంలో పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పీఎం పాలెం చివరి బస్‌స్టాప్ వద్ద ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. మృతుడు విజయనగరానికి చెందిన కేశల అప్పలరాజు(35)గా గుర్తించారు. పీఎంపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

News October 7, 2024

యలమంచిలి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ

image

యలమంచిలి మాజీ MLA కన్నబాబు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాంబిల్లిలోని ఆయన ఇంటి తలుపు గడియలు విరగ్గొట్టి లోపలకు ప్రవేశించారు. పూజగదిలో వెండి వస్తువులు పట్టుకుపోయారు. వీటి విలువ రూ.50వేల వరకు ఉంటుందని అంచనా. అలాగే ఓ గ్యాస్ ఏజెన్సీలో రూ.50వేల నగదు పోయినట్లు బాధితుడు పి.సంతచేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీలపై ఆదివారం ఫిర్యాదులు అందడంతో దర్యాప్తు చేస్తున్నామని CI సీహెచ్ నర్సింగరావు తెలిపారు.