News October 26, 2025
విశాఖ: నడిసంద్రంలో బిక్కుబిక్కుంటూ

విశాఖలోని జాలరిపేటకు చెందిన ఎల్లాజీ శుక్రవారం ఉదయం చేపల వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. శనివారం 8 బోట్ల సహాయంతో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. వేట సమయంలో తిరగబడిపోయిన తెప్పపై 40 గంటల పాటు నిలబడి ప్రాణాలు కాపాడుకున్నాడు. బిక్కుబిక్కుమంటూ ఉన్న ఎల్లాజీని కాకినాడ జిల్లా కంతంపేట మత్స్యకారులు గమనించి కాపాడారు. స్థానిక జేడి ఆఫీసుకి సమాచారం అందజేయండంతో విశాఖ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News October 26, 2025
విశాఖ కలెక్టరేట్‌లో రేపటి ‘పీజీఆర్ఎస్’ రద్దు: కలెక్టర్

‘మొంథా’ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో, విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం (అక్టోబర్ 27) జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. తుఫాను ముందస్తు చర్యల కోసం అధికారులు అందుబాటులో ఉండాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం PGRS యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 26, 2025
మంత్రి సత్యకుమార్ విశాఖ పర్యటన రద్దు

ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ విశాఖ పర్యటన రద్దయింది. ఆదివారం రాత్రి విశాఖ చేరుకుని మూడు రోజుల పాటు నగరంలో పర్యటించనున్నారని మొదట ప్రకటన జారీ చేశారు. అయితే మొంథా తుపాన్ నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు అయినట్లు అధికారులు తెలిపారు.
News October 26, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండండి: జీవీఎంసీ కమిషనర్

తుఫాను కారణంగా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. సహాయక చర్యల కోసం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ (0891-2507225), టోల్ ఫ్రీ నంబర్ (1800-425-0009) ఏర్పాటు చేశామన్నారు. లోతట్టు, కొండవాలు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండాలని, తప్పుడు సమాచారం నమ్మవద్దని సూచించారు.


