News February 10, 2025

విశాఖ: నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు ఈరోజు ఆఖరి రోజు కాగా ఇప్పటివరకు 8మంది నామపత్రాలు సమర్పించారు. సోమవారం ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల పరిశీలన ఈనెల 11న చేస్తారు. 13 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

Similar News

News October 31, 2025

విశాఖ రైతు బజార్‌లకు 3 వారాలపాటు సెలవులు లేవు

image

మొంథా తుఫాన్ ప్రభావంతో విశాఖలోని అన్ని రైతు బజార్‌లు వచ్చే 3 వారాల పాటు నిరంతరంగా కొనసాగించాలని CEO ఆదేశాలు జారీ చేశారు. వారానికి 7 రోజులు మార్కెట్లు పూర్తిగా ఓపెన్‌గా ఉంచాలని సూచించారు. ప్రజలకు అవసరమైన కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీని ఆదేశించారు.

News October 31, 2025

విశాఖ: నదిలో గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం

image

విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునిపొలం గ్రామంలోని గెడ్డలో గురువారం ధనుశ్రీ (13) గల్లంతైన విషయం తెలిసిందే. తండ్రి శ్రీనుతో కలిసి బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గెడ్డలో పడిపోయింది. ధనుశ్రీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. శుక్రవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. కుమార్తె మృతదేహం వద్ద తల్లి రోదన చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు.

News October 31, 2025

విశాఖ: నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం

image

తుఫాన్ ప్రభావం తగ్గడంతో నేటి నుంచి యధావిధిగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. 3 రోజులుగా కొనసాగిన తుఫాన్ తరువాత పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. విద్యార్థుల భద్రత కోసం ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని DEO ప్రేమ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల పరిసరాల్లో చెట్ల కొమ్మలు, కరెంట్ వైర్లు, తడిసిన గోడలు వంటి అంశాలను పరిశీలించి విద్యార్థులను తరగతులకు అనుమతించాలని సూచించారు.