News November 27, 2024
విశాఖ: ‘నా భర్తపై 20 కేసులు పెట్టారు’
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్‌పై 20 కేసులు పెట్టారని ఆయన భార్య ఇంటూరి సృజన అన్నారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. తన భర్తను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారన్నారు. ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వడం లేదని చెప్పారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, స్టంట్ వేశారని విశ్రాంతి అవసరమని చెప్పినా వినడం లేదన్నారు. సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెట్టారో స్పష్టం చేయాలన్నారు.
Similar News
News November 27, 2024
పరవాడ ఘటనపై దర్యాప్తునకు అనకాపల్లి కలెక్టర్ ఆదేశం
పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ ల్యాబ్స్‌లో జరిగిన ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మంగళవారం రాత్రి లిక్విడ్ లీకేజ్ వల్ల 9 మంది కార్మికులు శ్వాస, దగ్గుతో ఇబ్బంది పడ్డారని తెలిపారు. వీరిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వీరిలో ఒడిశాకు చెందిన హెల్పర్ అమిత్ బుధవారం మృతి చెందినట్లు కలెక్టర్ తెలిపారు. ఇద్దరికి వెంటిలెటర్ చికిత్స జరుగుతుందన్నారు.
News November 27, 2024
విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రమాదకరమైన బల్లులు స్వాధీనం
వైజాగ్ ఎయిర్ పోర్టులో అత్యంత ప్రమాదకరమైన బల్లులను కస్టమ్స్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. నీలిరంగు నాలుక కలిగిన బల్లులు మూడు, వెస్ట్రన్ బల్లులు మూడు స్వాధీనం చేసుకున్నారు. థాయిలాండ్ నుంచి అక్రమంగా ఇండియాకు తరలిస్తుండగా ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఫారెస్ట్ సర్వీస్ అధికారులు సంయుక్త తనిఖీల్లో విషయం వెలుగులోకి వచ్చింది.
News November 27, 2024
పరవాడ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా
పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఈ మేరకు అమరావతి నుంచి ఆయన అనకాపల్లి జిల్లా అధికారులతో మాట్లాడారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీకైన ఘటనలో <<14723741>>ఒకరు మృతి<<>> చెందగా ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని అధికారులు చంద్రబాబుకు వివరించారు. వారిని కేర్ క్రిటికల్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. మరో ఆరుగురి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు.