News February 3, 2025

విశాఖ: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ 

image

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైమ్ అండ్ షిప్పింగ్ విశాఖ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉపాధి ఇవ్వనున్నట్లు కమాండర్ గోపి కృష్ణ సోమవారం తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ, ఐ.టి.ఐ చదివిన వారు అర్హులన్నారు. వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, CNC ప్రోగ్రామర్, ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల వారు సింధియా జుంక్షన్ CEMS కేంద్రంలో FEB 10వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

Similar News

News February 3, 2025

విశాఖలో ఎలక్ట్రీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ

image

విశాఖలో న్యాక్ ద్వారా నిరుద్యోగులకు ఎలక్ట్రీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసి 15-45 సం.లోపు వారికి 3 నెలల శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టారులో ఉపాధి కల్పిస్తారని చెప్పారు. మహారాణిపేట న్యాక్ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ అందిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News February 3, 2025

విశాఖలో ఆరుగురిపై PD యాక్ట్..!

image

రాష్ట్రంలో పలువురిపై PD యాక్ట్ అమలు చేస్తూ స్టేట్ గవర్నమెంట్ ఆదివారం రాత్రి GO విడుదల చేసింది. వారిలో విశాఖకు చెందిన రావాడ జగదీశ్, రావాడ ఉదయ్ భాస్కర్, ఈతలపాక రాజ్ కుమార్, కొలగాన పవన్ రాజ్ కుమార్, నక్కా లోకేశ్, కాండ్రేగుల లోక్ నాథ్ వీర సాయి శ్రీనివాస్‌ ఉన్నారు. ఎయిర్ పోర్టు, పీఎం పాలెం, ఆరిలోవ, దువ్వాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు.

News February 3, 2025

విశాఖ: యాక్సిడెంట్‌లో టీచర్ మృతి

image

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కనిమెల్ల జంక్షన్ సమీపంలో హైవేపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పీఎం పాలెంకు చెందిన సౌజన్య అనే ఉపాధ్యాయురాలు మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. సౌజన్య భోగాపురం మండలం పోలిపల్లి ఉన్నత పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు.