News February 25, 2025

విశాఖ: ‘నిర్ణీత సమయంలో ధ్రువపత్రాలు అందించాలి’

image

జనన, మరణ, కుల, వివాహ, ఆదాయ ధ్రువపత్రాలను నిర్ణీత సమయంలో అందించాలని జిల్లా న్యాయాధికారి సంస్థ సెక్రటరీ వెంకట శేషమ్మ పేర్కొన్నారు. జీవీఎంసీ జోన్ -4 కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సర్టిఫికెట్లు జారీ విషయంలో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యంతో 6 నెలలకు ఒకసారి సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. మ్యారేజ్ ధృవపత్రాలు జారీ చేసేటప్పుడు వధూవరుల వయసు పరిగణలోకి తీసుకోవాలన్నారు.

Similar News

News February 26, 2025

శ్రీకాకుళం వరకే విశాఖ -పలాస పాసింజర్

image

విశాఖ-పలాస రైల్వే లైన్‌లో సాంకేతిక సమస్యల కారణంగా విశాఖ-పలాస పాసింజర్ (67289/90)శ్రీకాకుళం వరకు మాత్రమే నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. మార్చ్ 2 నుంచి మార్చ్ 8వరకు ఈ రైళ్ళు శ్రీకాకుళం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పలాసకు బదులుగా శ్రీకాకుళం నుంచి బయలుదేరనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News February 26, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నగర పోలీస్ కమీషనర్ శంఖబ్రత బాగ్చితో కలిసి రహదారి భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. గతేడాది విశాఖ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన, క్షతగాత్రుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం తరపున అందిన సహాయక చర్యలపై ఆరా తీశారు.

News February 26, 2025

విశాఖపట్నంలో టుడే టాప్ న్యూస్

image

➤ విశాఖలో మూతపడిన మద్యం షాప్‌లు ➤ విశాఖ ఆర్డీవో శ్రీలేఖకు హైకోర్టులో చుక్కెదురు ➤ నేటితో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ➤ ఎమ్మెల్సీ ఎన్నికలకు 123 పోలింగ్ కేంద్రాలు.. 22493 మంది ఓటర్లు ➤ రేపు విశాఖ రానున్న సినీ నటుడు బ్రహ్మానందం ➤ విశాఖలో ఆధార్ కార్డు లేని చిన్నారులు 3200 మంది ➤ వెంకోజీపాలెంలో వ్యక్తి దారుణ హత్య

error: Content is protected !!