News December 29, 2024
విశాఖ నుంచి కాకినాడ వరకు సముద్రంలో ఈదుతూ..
విశాఖ నుంచి కాకినాడ వరకు సముద్రంలో దాదాపు 150 కిలోమీటర్ల మేర ఈదుతూ ప్రయాణించే సాహస యాత్రను సామర్లకోటకు చెందిన శ్యామల గోలి అనే మహిళ ప్రారంభించారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, గండి బాబ్జి పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సాహస యాత్ర ఆమె ఆత్మవిశ్వాసానికి, మహిళల శక్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఒక్క రోజులో దాదాపు 30 కిలోమీటర్లు ఈదుతూ 5 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో శ్యామల ప్రణాళిక రూపొందించారు.
Similar News
News December 31, 2024
పేపర్ లీక్ చేసిన వ్యక్తి ఉమ్మడి తూ.గో. వాసే
పదో తరగతి SA-1 పరీక్షల్లో లెక్కల పేపర్ లీక్‌కు కారణమైన ఉమ్మడి తూ.గో.(D) రామచంద్రపురం మండల విద్యాశాఖాధారితోపాటు టీచర్ సుబ్బారావును విజయవాడ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో సోమవారం హాజరుపరచగా రిమాండ్ విధించారు. మండలంలోని హైస్కూల్‌లో ఓ విద్యార్థికి ప్రశ్నపత్రాన్ని ఆయన ఇవ్వగా.. బాలిక టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసింది. వెంటనే ఓ యూట్యూబ్ ఛానల్‌లో ప్రత్యక్షమవడంతో విషయం తెలిసింది.
News December 31, 2024
కోరుకొండ: రేవ్ పార్టీలో 19 మంది అరెస్ట్.. వివరాలివే
కోరుకోండలోని రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి మొత్తం 19 మందిని అరెస్ట్ చేశారు. గోపాలకృష్ణ అనే వ్యక్తి రూ.18వేలకు ఫంక్షన్ హాల్ బుక్ చేసి పార్టీ నిర్వహించారు. ఇక్కడికి TNK, ఆచంట, గోపాలపురానికి చెందిన 10మంది ఎరువుల డీలర్లను రప్పించారు. కాకినాడకు చెందిన మహిళ ద్వారా ఐదుగురు అమ్మాయిలను రప్పించి వారితో డీలర్లు మద్యం తాగుతూ డ్యాన్స్ చేశారు. ఫంక్షన్ హాల్ యజమాని కుమారుడు, 10మంది డీలర్లపై కేసు నమోదు చేశారు.
News December 30, 2024
2024@ ఉమ్మడి తూ.గోలో పొలిటికల్ పిక్చర్ ఛేంజ్
ఉమ్మడి తూ.గో జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని 2024 ఎన్నికలు మార్చేశాయి. 2019లో 19 నియోజకవర్గాల్లో YCP 14, TDP 4, జనసేన ఒక స్థానంలో నెగ్గాయి. కాగా ఈ ఎన్నికల్లో 3 ఎంపీ సీట్లతో పాటు మొత్తం 19 నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి జిల్లా రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇక్కడి నుంచి గెలిచిన పవన్ డిప్యూటీ సీఎం కావడం విశేషం.