News August 29, 2025
విశాఖ నుంచి కుప్పం బయలుదేరిన సీఎం

విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు సాయంత్రం 5 గంటలకు కుప్పం బయలుదేరారు. విమానాశ్రయంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, హోం మంత్రి, ఎమ్మెల్యేలు ఇతర అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
Similar News
News August 29, 2025
పిల్లలను యూట్యూబ్, పబ్జిలకు దూరంగా ఉంచాలి: లోకేశ్

క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ జయంతిని సందర్భంగా విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. క్యాబినెట్ సమావేశాల్లో క్రీడల అభివృద్ధిపై చర్చిస్తున్నామన్నారు. పిల్లలను యూట్యూబ్, పబ్జీలకు దూరంగా ఉంచి, క్రీడల పట్ల ఆసక్తి పెంచాలన్నారు.
News August 29, 2025
సుగాలి ప్రీతి అంశాన్ని డైవర్ట్ చేయడానికే రుషికొండ సందర్శన: రాజు

సుగాలి ప్రీతి అంశాన్ని డైవర్ట్ చేయడానికి రుషికొండ భవనాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఋషికొండ భవనంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సచివాలయ భవనాలకు ఇచ్చిన రేటు కంటే తక్కువ రేటుకే రుషికొండ భవనాలు నిర్మించామన్నారు. స్టీల్ ప్లాంట్ రక్షణపై చిత్తశుద్ధి ఉంటే శనివారం జరిగే జనసేన సభలో తీర్మానం చేయాలన్నారు.
News August 29, 2025
మండపాల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు: ఎస్ఈ

వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ శ్యాంబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండపాల నిర్వాహకులు లైసెన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్లతోనే పనులు చేయించాలని సూచించారు. తగిన సామర్థ్యం ఉన్న ఫ్యూజ్ వాడాలని, ఓవర్ లోడ్ అవ్వకుండా చూసుకోవాలని అన్నారు. ఎంసీబీలు, ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్లు ఉపయోగించాలని అన్నారు. నాణ్యమైన వైర్లు వాడాలన్నారు.