News March 12, 2025

విశాఖ నుంచి పట్నాకు ప్రత్యేక రైళ్ళు

image

హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి పట్నాకు స్పెషల్ (08537/38) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈ రైళ్లు విశాఖ నుంచి మార్చి 16, 23, 30 తేదీలలో బయలుదేరి మరుసటి రోజు పట్నాకు చేరుతాయి. మళ్లీ మార్చి 17, 24, 31 తేదీలలో పాట్నా నుంచి బయలుదేరి విశాఖ చేరుతాయని.. ప్రయాణికులు గమనించాలని కోరారు.

Similar News

News March 12, 2025

విశాఖ: అమ్మతో పేగు బంధం.. భగవంతుడితో అనుబంధం..!

image

జన్మనిచ్చిన తల్లికి తండ్రి కొనిచ్చిన స్కూటర్‌పై దేశమంతా తిప్పి చూపించాడు. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవాలయ దర్శనాలు చేపించాడు మైసూర్‌కు చెందిన దక్షిణామూర్తి కృష్ణ కుమార్. తన తల్లి చూడారత్నమ్మ కోరిక మేరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ఆలయాలకు స్కూటర్ పైనే తిప్పాడు. తల్లికిచ్చిన మాట కోసం ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదిలేశారు. వీరిద్దరూ బుధవారం విశాఖ చేరుకున్నారు.

News March 12, 2025

విశాఖలో విచ్చలవిడిగా గుట్కా..!

image

విశాఖనగరంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు విచ్చలవిడిగా లభిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఒడిశా నుంచి రైలు మార్గంలో ఖైని, గుట్కా, పాన్ మసాలాలు విశాఖకు చేరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మధురవాడ, ఆరిలోవ, వెంకోజిపాలెం, మద్దిలపాలెం ప్రాంతాలలో ఏ దుకాణంలో చూసిన ఇవి విరివిగా లభిస్తున్నాయి. ఆహారభద్రత అధికారులు వీటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

News March 12, 2025

గాజువాకలో వైసీపీ నాయకుడిపై కేసు 

image

వైసీపీ కార్పొరేటర్‌గా పోటీ చేసిన దొడ్డి రమణతో పాటు మరో ముగ్గురు అకారణంగా దూషించి మతిస్థిమితం లేని తన కుమార్తెపై దాడి చేశారని ఓ మహిళ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 64వ వార్డుకు చెందిన దొడ్డి రమణ, మంత్రి మంజుల వెంకటేశ్వరస్వామి దేవస్థానం నిర్వహిస్తున్నారు. దేవాలయంలో హుండీ పోగా.. దార రమణమ్మ కొడుకు దొంగలించాడంటూ గతనెల 28న దాడి చేసినట్లు ఫిర్యాదు చేయడంతో సీఐ పార్థసారథి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!