News January 8, 2025

విశాఖ నుంచి సంక్రాంతి స్పెషల్ బస్సులు

image

విశాఖ నుంచి సంక్రాంతి ప్రత్యేక బస్సులను ఈనెల తొమ్మిదవ తేదీ నుంచి నడపనున్నట్లు ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ బి. అప్పలనాయుడు తెలిపారు. ద్వారక బస్ స్టేషన్, మద్దిలపాలెం, గాజువాక, సింహాచలం డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతామన్నారు. ఈ మేరకు రెండువందల బస్సులను సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. డిమాండ్‌ను బట్టి రాత్రి వేళల్లో కూడా బస్సులు నడిపే ఆలోచన ఉందన్నారు.

Similar News

News January 9, 2025

VZM: ‘గుంత‌లు లేని ర‌హ‌దారులుగా 296 కిలోమీట‌ర్లు’

image

ప‌ల్లె పండుగ‌లో భాగంగా గుంత‌లు లేని ర‌హదారులే ల‌క్ష్యంగా విజయనగరం జిల్లాలో చేప‌ట్టిన రోడ్ల‌ మ‌ర‌మ్మ‌తు ప‌నులు 296 కిలోమీట‌ర్ల మేర పూర్తి అయ్యాయ‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ తెలిపారు. రోడ్ల‌ మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌పై అధికారుల‌తో క‌లెక్ట‌ర్ త‌మ ఛాంబ‌ర్‌లో బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. జిల్లాలో 884 కిలోమీట‌ర్ల మేర ర‌హ‌దారుల‌ మ‌ర‌మ్మ‌తుల‌కు 176 ప‌నుల‌ను ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.

News January 8, 2025

ఏయూ పరిధిలో పరీక్షలు వాయిదా

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో బుధవారం ఉదయం జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ E.N ధనంజయరావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో పరీక్షలను వాయిదా వేశామని అన్నారు. మరలా ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

News January 8, 2025

విశాఖలో ప్రధాని సభ.. ఫుడ్ పంపిణీకి పక్కా ఏర్పాట్లు

image

విశాఖలో ప్రధాని మోదీ సభకు వచ్చే ప్రజలకు మధ్యాహ్నం పులిహోరా, మజ్జిగ ప్యాకెట్, వాటర్ బాటిల్ రాత్రికి బిర్యానీ, వాటర్, మజ్జిగ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వనున్నారు. GVMC పరిధిలో వాహనాలు బయలుదేరే చోటే ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయనున్నారు. అనకాపల్లి, విజయనగరం నుంచి వచ్చేవారికి ఆ జిల్లా అధికారులు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చే వారికి నాతవలస చెక్‌పోస్టు వద్ద ఆహారం అందిస్తారు.