News April 16, 2024

విశాఖ: నేటి నుంచి కొత్త విమాన సర్వీసు ఏర్పాటు

image

విశాఖ- హైదరాబాద్ నూతన విమాన సర్వీసు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. రాత్రి 11.40 గంటకు విశాఖలో బయలుదేరి 12.50 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. అంతకముందు అదే సర్వీసు రాత్రి 9.35 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి 11.00 గంటలకు విశాఖ వస్తుంది. విమానయాన ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు కోరారు.

Similar News

News October 7, 2025

‘ఉపాధి హామీ వేతనదారులు ఈ-కేవైసీ చేయించుకోవాలి’

image

ఉపాధి హామీ పథకం వేతనదారులకు ఈ-కేవైసీ చేస్తున్నామని డ్వామా పీడీ పూర్ణిమాదేవి తెలిపారు. NMMS యాప్‌లో ముఖ ఆధారిత హాజరు నమోదుకు దీన్ని చేపట్టామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఒకరికి బదులు మరొకరు పనికి రాకుండా ముఖ ఆధారిత హాజరు పద్ధతి ప్రారంభం కానుందని అన్నారు. జిల్లాలో 47,725 మందికి ఈ-కేవైసీ జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు, జాబ్ కార్డులతో క్షేత్ర సహాయకుడిని సంప్రదించాలని కోరారు. ‌

News October 7, 2025

సుజాతనగర్ జంక్షన్‌లో యాక్సిడెంట్.. మహిళ మృతి

image

పెందుర్తిలోని సుజాతనగర్ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పెందుర్తి ట్రాఫిక్ సీఐ సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 7, 2025

విశాఖ: ఆర్టీసీలో ఐటీఐ అప్రెంటీస్‌లకు అవకాశం

image

ఏపీఎస్ఆర్టీసీ విశాఖ రీజియన్ పరిధిలో 2వ విడత ఐటీఐ అప్రెంటిస్‌షిప్ అలాట్‌మెంట్లను రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు మంగళవారం జారీ చేశారు. అప్రెంటిస్‌లు భద్రతా నియమాలు పాటిస్తూ నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసినవారికి ఖాళీలను బట్టి ఔట్‌సోర్సింగ్‌లో అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే 18 నెలల హెవీ లైసెన్స్ అనుభవం ఉన్నవారికి ఆన్-కాల్ డ్రైవర్లుగా అవకాశం ఉందని తెలిపారు.