News April 3, 2024
విశాఖ: నేటి నుంచి పెన్షన్‌ల పంపిణీ
ఎన్నికల నిబంధనల మేరకు సామాజిక పెన్షన్‌ల పంపిణీ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభించేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలల పెన్షన్‌లు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది సచివాలయాల్లో అందజేస్తారన్నారు. పింఛనుదారులు ఆధార్ కార్డు తీసుకొని సచివాలయానికి రావాలన్నారు. 7వ తేదీ వరకు ఉదయం 7.30 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ జరుగుతుందన్నారు.
Similar News
News January 7, 2025
ప్రధాని సభా ప్రాంతం పరిశీలించిన ఎంపీ శ్రీ భరత్
విశాఖలో ప్రధాని మోదీ పర్యటన పనులను మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి విశాఖ ఎంపీ శ్రీ భరత్ పరిశీలించారు. రోడ్డు, ప్రధాని సభ, గ్యాలరీ, బారికేడ్లు, పనులను పరిశీలించారు. దూర ప్రాంతాల నుంచి ప్రధానిని చూడటానికి వస్తున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లను మరింత బాగా చేయాలని అధికారులను ఆదేశించారు.
News January 7, 2025
ప్రధానమంత్రి రోడ్ షోకు ప్రచార రథం సిద్ధం..!
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విశాఖలో నిర్వహించిన రోడ్ షోకు ప్రచార రథాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. వెంకటాద్రి వంటిల్లు ప్రాంతం నుంచి ఏయూ మైదానం వరకు ప్రధాని ఈ రథంపై రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధానంగా మోదీ బొమ్మ మధ్యన ఉంటూ ఇరువైపులా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది
News January 7, 2025
పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు: హోం మంత్రి అనిత
పాయకరావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ ప్లాంట్ వల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. మంగళవారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఏయూలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. ప్రధాని పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురుచూస్తోందని పేర్కొన్నారు.