News April 8, 2025

విశాఖ: నేడు జూ పార్క్‌ను సందర్శించనున్న డిప్యూటీ సీఎం 

image

రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజులు విశాఖ పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం విశాఖ జూ పార్క్‌కు రానున్నారు. ఈ మేరకు జూ పార్కు క్యూరేటర్ మంగమ్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్కడ జరిగే ఎకో టూరిజం మీటింగ్‌లో పవన్ కళ్యాన్ పాల్గొంటారని చెప్పారు.

Similar News

News April 8, 2025

CREDAI విశాఖ చాప్టర్ ఛైర్మన్‌గా ధర్మేందర్

image

కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI) విశాఖ చాప్టర్ 2025-26 చైర్మన్ గా వి. ధర్మేందర్, అధ్యక్షుడిగా ఇ.అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా వి.శ్రీను ఎన్నికయ్యారు. కోశాధికారిగా కె.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కృషి చేస్తామని కార్యవర్గం ప్రకటించింది.‌ విశాఖ రియల్ ఎస్టేట్ రంగంలో CREDAI కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

News April 8, 2025

విశాఖలో ఏడేళ్ల బాలుడి మృతి

image

విశాఖ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్‌ వాటర్ వరల్డ్‌లో రిషి(7) మృతి చెందాడు. గుట్టు చప్పుడు కాకుండా బైక్‌పై ప్రైవేట్ ఆసుపత్రికి స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించగా.. బంధువులు ఆందోళనకు దిగినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 8, 2025

విశాఖలో నేటి కాయగూరల ధరలు

image

విశాఖ 13 రైతు బజార్లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు మంగళవారం నాడు కాయగూరల ధరలను విడుదల చేశారు. (రూ.కేజీ)లో టమాటా రూ.16, ఉల్లిపాయలు రూ.21, బంగాళదుంపలు రూ.17, మిర్చి రూ.26, పికోడా మిర్చి రూ.60, క్యారెట్ రూ.36, మట్టి చామ రూ.28, చిలకడదుంపలు రూ.40, బద్ద చిక్కుడు రూ.62, మామిడి అల్లం రూ.55, కీరదోస రూ.24, కాలీఫ్లవర్ రూ. 20, బెండ రూ.28, బీరకాయలు రూ.42, వంకాయలు రూ.22/28 గా ధరలు నిర్ణయించారు.

error: Content is protected !!