News December 18, 2024

విశాఖ: నేడు INS నిర్దేశిక్ నౌకను జాతికి అంకితం చేయనున్న మంత్రి

image

విశాఖలో బుధవారం ఐన్ఎన్ఎస్ నిర్దేశిక్ నౌకను కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను నౌకాదళ అధికారులు చేశారు. కోల్‌కతాలో ఐఎన్ఎస్ నిర్దేశిక్ నౌక నిర్మాణం జరిగింది. 110 మీటర్ల పొడవు, 3800 టన్నుల బరువైన దీనిని రెండు ఇంజన్లతో రూపకల్పన చేశారు. మధ్యాహ్నం ఈ కార్యక్రమం జరగనుంది.

Similar News

News September 20, 2025

విశాఖ: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విశాఖలో ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. పెందుర్తి పోలీసుల వివరాల ప్రకారం.. చెంగల్‌రావుపేటకు చెందిన బెహరా అబ్బాయి (65) ఇంట్లో క్లీనింగ్ చేస్తుండగా, ఇనుప రాడ్ ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ వైర్లకు తగిలింది. ఈ ఘటనలో ఆయన చేతులు, శరీరంపై పలుచోట్ల కాలి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News September 20, 2025

25న ఎంవీపీ కాలనీలో తపాలా డాక్ అదాలత్

image

తపాలా వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 25న ఎంవీపీ కాలనీ రీజనల్ కార్యాలయంలో 119వ తపాలా డాక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులను ఈ నెల 22వ తేదీ లోపు రీజనల్ కార్యాలయం చిరునామాకు సమర్పించాలని అధికారులు తెలిపారు.

News September 20, 2025

కౌన్సిల్ తీర్మానం మేరకే ఆక్రమణలు తొలగింపు: జీవీఎంసీ కమిషనర్

image

జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానానికి అనుగుణంగా ఫుడ్ కోర్ట్ తొలగించడం జరుగుతుందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శుక్రవారం తెలిపారు. ఫుడ్ కోర్ట్‌లో 160 దుకాణాలు అనధికారకంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారన్నారు. 2023లోని జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఫుడ్ కోర్ట్ తొలగింపునకు కౌన్సిల్ తీర్మానించదన్నారు. మరళ 2025 ఆగస్టు 22న జీవీఎంసీ కౌన్సిల్‌లో సభ్యుల అంగీకారంతో తీర్మానం జరిగిందన్నారు.