News January 18, 2026
విశాఖ: నేవీ కార్యక్రమాలపై సీపీ సమీక్ష

విశాఖలో ఫిబ్రవరి 14 నుంచి 25 వరకు జరగనున్న ఐ.ఎఫ్.ఆర్, మిలాన్, ఐయాన్స్-కాన్ క్లెవ్ కార్యక్రమాలపై పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి నేవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రత, ట్రాఫిక్ మేనేజ్మెంట్, నో-డ్రోన్ జోన్, పార్కింగ్‌పై కీలక చర్చలు జరిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News February 20, 2026
జనతా వారధిలో వినతులు స్వీకరించిన పీవీఎన్ మాధవ్

బీజేపీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర కార్యాలయం (విశాఖ)లో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రజల వినతులు స్వీకరించారు. ఎస్‌వీఎస్ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ప్రతి శుక్రవారం ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News February 20, 2026
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు 20 ఫిర్యాదులు

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకారరావు ఆధ్వర్యంలో నిర్వహించిన టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు 20 వినతులు అందాయి. పట్టణ ప్రణాళికా విభాగంపై వచ్చే ఫిర్యాదుల త్వరితగతిన పరిష్కారానికి ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అత్యధికంగా నార్త్ జోన్ నుంచి 6 వినతులు రాగా.. అధికారులు వెంటనే స్పందించి వీటిని పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.
News February 20, 2026
సంకల్ప కళా గ్రామంలో విదేశీ ప్రతినిధుల సందడి

విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా పెందుర్తి సమీపంలోని సంకల్ప కళా గ్రామంలో సహజ రంగుల అద్దకంపై కార్యశాల నిర్వహించారు. నేవీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 50 దేశాల ప్రతినిధులు పాల్గొని చేనేతలు, లక్క బొమ్మలను పరిశీలించారు. విసరడం, దంచడం వంటి పురాతన పద్ధతులను స్వయంగా చేసి ఆనందించారు. అనంతరం కోలాటం, జానపద నృత్యాలతో అతిథులు సందడి చేశారు.


