News December 31, 2024

విశాఖ: న్యూయర్ వేడుకలకు యువత సిద్ధం

image

ఉమ్మడి విశాఖలో న్యూయర్ వేడుకలకు యువత సిద్ధమైంది. గతంతో పోలిస్తే ఈ వేడుకల్లో ఎంతో తేడా కనిపిస్తుంది. పదేళ్ల కిందట వరకు గ్రీటింగ్ కార్డ్స్ పంచుకుంటూ శుభాకంక్షలు తెలిపే వారు. హైటెక్ యుగంలో గ్రీటింగ్ కార్డ్స్ తెరమరుగవగా వాట్సాప్ ద్వారా గ్రీటింగ్స్ తెలుపుకుంటున్నారు. ఇటు విశాఖ బీచ్ రోడ్డులో న్యూయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు యువత ఉత్సాహం చూపుతున్నారు. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి.

Similar News

News March 2, 2026

వర్క్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేయండి: విష్ణుకుమార్ రాజు

image

GVMC ఇంజనీరింగ్ విభాగంలో 15 ఏళ్లకు పైగా ఒకే వార్డులో పనిచేస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్లను తక్షణమే బదిలీ చేయాలని మేయర్, కమిషనర్‌ను MLA విష్ణుకుమార్ రాజు కోరారు. 5-15 ఏళ్ల వరకు బదిలీ లేకుండా కొనసాగుతున్న వారిలో కొందరు కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీంతో అభివృద్ధి పనుల్లో అవినీతి చోటుచేసుకుంటోందని అన్నారు. పారదర్శకత కోసం వెంటనే బదిలీలు చేపట్టాలని కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించారు.

News March 2, 2026

విశాఖ: కాంట్రాక్టర్లుగా వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు..!

image

GVMC ఇంజినీరింగ్ విభాగంలో కొందరు వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు అనుబంధ కాంట్రాక్టర్ల పేర్లతో టెండర్లు వేసి పనులు దక్కించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనుల కొలతలు తీసి ఎం-బుక్ నమోదు కోసం ఏఈలకు అందజేస్తున్నారని సమాచారం. ఏటా రూ.500 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో పలు జోన్‌లలో ఇదే తీరుగా వ్యవహారం సాగుతోందని విమర్శలున్నాయి. వీరిపై ఫిర్యాదులు చేరినా చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

News March 2, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే గతవారం పీజీఆర్ఎస్ నిర్వహించలేదు.