News June 5, 2024

విశాఖ: పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించిన రైల్వే

image

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని రైల్వే అధికారులు ఘనంగా నిర్వహించారు. డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద పర్యావరణ ప్రాధాన్యత తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైల్లో ప్రయాణికులకు చేతి సంచులను పంపిణీ చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రచారం జరిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు మంజు శ్రీ ప్రసాద్ నేతృత్వంలో మొక్కలు నాటారు.

Similar News

News February 12, 2026

విశాఖలో జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

image

విశాఖపట్నం జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జూన్ జి.విలియమ్స్ సాప్ (SAAP) లీగ్స్ జిల్లా స్థాయి ఎంపికల వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 17న గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో చదరంగం, 24న బీచ్ రోడ్డులో సైక్లింగ్ పోటీలు జరుగుతాయి. ఆసక్తిగల క్రీడాకారులు తమ ఆధార్ కార్డుతో సాప్ (SAAP) అధికారిక వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని ఆమె సూచించారు.

News February 12, 2026

విశాఖలో మురికివాడల అభివృద్ధే లక్ష్యం

image

విశాఖలో మురికివాడల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు GVMC కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, రోడ్ల విస్తరణపై దృష్టి పెట్టామన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో మెరుగైన ర్యాంక్ లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. RKబీచ్-రుషికొండ వరకు 6 సులభ్ కాంప్లెక్స్‌లు.. వెలంపేట, ఇందిరానగర్‌లో పైలట్ ప్రాజెక్టుల కింద గృహ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

News February 12, 2026

ఆస్తిపన్ను బకాయిదారులపై GVMC కఠిన చర్యలు..

image

GVMC పరిధిలో ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిల వసూళ్ల విషయంలో GVMC కఠినంగా వ్యవహారిస్తోంది. 2025-26 సంవత్సరానికి రూ.566 కోట్ల లక్ష్యంలో ఇప్పటివరకు రూ.360 కోట్లు వసూలయ్యాయి. 6 లక్షలకు పైగా మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేశారు. చెల్లింపులు లేకపోతే ఆస్తుల సీజ్‌కు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే 60 వేల మందికి నోటీసులు పంపగా.. మరో 20 వేల మందికి కుళాయి కనెక్షన్లు కట్ చేసేందుకి రెడీ అవుతున్నారు.