News February 1, 2025
విశాఖ -పలాస పాసింజర్ రైళ్ల గమ్యం కుదింపు

వాల్తేర్ డివిజన్‌లో సాంకేతిక కారణాల వల్ల విశాఖ -పలాస పాసింజర్ రైళ్ల గమ్యం కుదింపు చేసినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-పలాస (67289/90)రైళ్లు ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు శ్రీకాకుళం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పలాసకు బదులుగా శ్రీకాకుళం నుంచి బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News February 18, 2026
ప్లీట్ రివ్యూలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ దంపతులు

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని వారు కలిశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, గవర్నర్ నజీర్, కేంద్ర మంత్రులు, నౌకదళ అధిపతులు, విదేశీ ప్రముఖులు పాల్గొన్నారు. యుద్ధనౌకల సామర్థ్యం వివరిస్తూ ఫీట్ రివ్యూ కొనసాగుతోంది.
News February 18, 2026
దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి: మాధవ్

విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో రాష్ట్రీయ RSS సభ్యులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్రంగా డిమాండ్ చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఒక జాతీయవాద సంస్థ అని అన్నారు. అటువంటి సంస్థ సభ్యులపై దాడికి పాల్పడడం అంటే కమ్యూనిస్టులు అరాచకత్వానికి పరాకాష్టగా అని అన్నారు.
News February 17, 2026
విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు మంగళవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు MP శ్రీ భరత్, జాయింట్ కలెక్టర్ విద్యాదరి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన నగరంలోకి వెళ్లారు.


