News June 11, 2024

విశాఖ: పలు రైళ్లును దారి మళ్లించిన రైల్వే అధికారులు

image

సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ ముస్తాబాద్-గన్నవరం సెక్షన్ మధ్య భద్రతాపరమైన ఆధునీకరణ పనులు కారణంగా పలు రైళ్లును దారి మల్లించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కే.సందీప్ పేర్కొన్నారు.
ఎర్నాకులం-పాట్నా (22643 ) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 11, 17, 18, 24, 25 తేదీల్లో, ఎస్‌న్‌వి బెంగళూరు- గువాహటి (125509) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 14, 21, 28 తేదీల్లో దారి మళ్లించనున్నారు.

Similar News

News January 16, 2025

విశాఖ: స్వగ్రామాల నుంచి పట్టణాలకు బయలుదేరిన ప్రజలు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లిన జిల్లా వాసులు పండగ కోసం తరలి వచ్చారు. మూడు రోజులు ఎంతో ఎంజాయ్ చేశారు. నిన్న రాత్రి నుంచే పలువురు తిరిగి తమ ఉద్యోగాలకు బయల్దేరారు. దీంతో జిల్లాలోని రైల్వే స్టేషన్‌లు, బస్ స్టేషన్‌లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. మరికొందరు సొంత వాహనాలతో తిరుగుపయనం అవుతున్నారు.

News January 16, 2025

విశాఖలో అనిల్ అంబానీ భారీ పెట్టుబడి!

image

విశాఖ జిల్లాకు మరో భారీ పెట్టుబడి రానుంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ విశాఖలో 1500 ఎకరాల పరిధిలో సోలార్ ప్లేట్స్ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే జిల్లాలో అనువైన భూములను పరిశీలించినట్లు సమాచారం. త్వరలోనే ఒక ప్లేస్‌ను ఫైనల్ చేసి పనులు ప్రారంభించనున్నారు. కాగా ఇప్పటికే అనీల్ అంబానీ అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో భూములను పరిశీలించిన సంగతి తెలిసిందే.

News January 16, 2025

రేవుపోలవరం సముద్రంలో మునిగి బాలుడి మృతి

image

రేవు పోలవరం సముద్ర తీరంలో బుధవారం కనుమ పండుగ రోజున బాలుడు సముద్రంలో మునిగి మృతి చెందగా మరో యువకుడు గల్లంతయ్యాడు. కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన పలువురు రేపు పోలవరం సముద్ర తీరానికి వచ్చారు. వీరిలో సాత్విక్ (10) సముద్రంలోకి దిగి మునిగిపోయాడు. బాలుడిని తీసుకువచ్చేందుకు దిగిన కాకర్ల మణికంఠ (22) గల్లంతయ్యాడు. ఒడ్డుకు కొట్టుకు వచ్చిన సాత్విక్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.