News December 28, 2024

విశాఖ-పార్వతీపురం మధ్య ప్రత్యేక రైలు

image

పండగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి పార్వతీపురానికి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ శుక్రవారం తెలిపారు. ఈ రైలు 08565/66 జనవరి 10 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. విశాఖలో ఉదయం 10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.20 పార్వతీపురం చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో పార్వతీపురం నుంచి 12.45 బయలుదేరి సాయంత్రం 4కి విశాఖ చేరుతుందని తెలిపారు.

Similar News

News December 28, 2024

VZM: ‘వైద్యాధికారులు బాధ్యతగా పని చేయాలి’

image

వైద్యాధికారులు గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితుల్ని తెలుసుకొని వాటికి తగ్గట్టుగా బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వైద్యాధికారులతో సమీక్షించారు. గత మూడు నెలలుగా డయేరియా అంశం జిల్లాను పట్టి పీడిస్తోందని, ప్రజల సందేహాలను నివృత్తి చేసేలా వాస్తవాలను వెల్లడించి నమ్మకం కలిగించాలని తెలిపారు.

News December 28, 2024

పార్వతీపురం: నూతన సంవత్సర ఈవెంట్స్‌కు పర్మిషన్ తప్పనిసరి

image

నూతన సంవత్సర వేడుకల ఈవెంట్స్‌కు పర్మిషన్ తప్పనిసరి అని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బాబ్జీరావు తెలిపారు. నూతన సంవత్సరం సంక్రాంతి పండుగలో లిక్కర్‌తో పార్టీలు జరుపుకునే వారు ఎక్సైజ్ సీఐ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని అని ఆయన తెలిపారు. సీఐ సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు పార్వతీపురం జిల్లా ఎక్సైజ్ అధికారి మొబైల్ నంబర్ 9490642242 ను సంప్రదించాలన్నారు.

News December 28, 2024

డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో నకిలీ IPS?

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. మక్కువ మండలంలోని గిరి శిఖర గ్రామమైన బాగుజోల పర్యటనలో నకిలీ ఐపీఎస్ హడావుడి సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ ఐపీఎస్‌తో పలువురు పోలీసులు సైతం ఫొటోలు దిగడం చర్చీనీయాంశమైంది. కాగా ఆయన ఎవరనేది పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.