News April 14, 2024
విశాఖ: పాసింజర్ రైళ్లు పునరుద్ధరణ

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ రైళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్లు వాల్తేరు డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. సంబల్పూర్ డివిజన్‌లో భద్రతాపరమైన ఆధునీకరణ పనులు కారణంగా రద్దయిన ఈ రైళ్లను విశాఖ-రాయగడ-విశాఖ మధ్య నడపనున్నట్లు తెలిపారు. ఈనెల 15 నుంచి 24 వరకు విశాఖ-రాయగడ మధ్య ఈనెల 16 నుంచి 25 వరకు రాయగడ- విశాఖ మధ్య ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు.
Similar News
News October 7, 2025
రుస్తోంజీ గ్రూప్ ఛైర్మన్ బొమన్ ఇరానీతో నారా లోకేష్ భేటీ

రుస్తోంజీ గ్రూప్ ఛైర్మన్ బొమన్ ఇరానీతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలో భేటీ అయ్యారు. ఐటీ కంపెనీలు, డేటా సెంటర్ల రాకతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మహా నగరంలో లగ్జరీ టౌన్ షిప్ నిర్మాణం చేపట్టాలని మంత్రి లోకేష్ ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బాగస్వామ్యం అవ్వాలని కోరారు.
News October 6, 2025
విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు

భారత మహిళా క్రికెట్ జట్టు సోమవారం రాత్రి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు జట్టుకు స్వాగతం పలికారు. గురువారం దక్షిణ ఆఫ్రికా జట్టుతో భారత జట్టు పీఎం పాలెం స్టేడియం వేదికగా తలపడనుంది. మంగళ, బుధవారాల్లో మహిళా జట్టు స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ మ్యాచ్ టికెట్ల కోసం క్రీడాభిమానులు కొనుగోలు కోసం ఆసక్తి చూపుతున్నారు.
News October 6, 2025
విశాఖకు టాటా గ్రూప్ చైర్మన్‌ను ఆహ్వానించిన మంత్రి

టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబైలో భేటీ అయ్యారు. విశాఖపట్నంలో ఈ నెలలో నిర్వహించనున్న టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిలో టాటా భాగస్వామ్యం కావాలని, అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.