News January 3, 2025
విశాఖ: పీఈటీ టెస్టులకు 278 మంది హాజరు
పోలీస్ కానిస్టేబుల్స్ ఎంపికకు కైలాసగిరి ఆర్ముడ్ రిజర్వ్ మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు నాలుగవ రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ పరీక్షల్లో 718 మంది మహిళా అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 278 మంది మాత్రమే ఈ పరీక్షలకు హాజరయ్యారు. ముందుగా అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి అనంతరం బయోమెట్రిక్ తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.
Similar News
News February 5, 2025
గాజువాకలో ఫార్మా ఉద్యోగి మృతి.. ఐదుగురు అరెస్ట్
గాజువాకలో ఫార్మసిటీ ఉద్యోగి భాస్కరరావు మృతి కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని గాజువాక సీఐ పార్థసారథి తెలిపారు. వీరు హింసించి, ఆత్మహత్యకు ప్రేరేపించడం వల్లే అతను మృతి చెందాడని ప్రాథమిక విచారణలో వెల్లడయ్యిందన్నారు. ఈ కేసులో ఏ-1 హేమంత నర్సింగ్ కుమార్(కూర్మన్నపాలెం), ఏ-2 ప్రియాంక(గాజువాక), ఏ-3 కర్రి లక్ష్మి(శ్రీనగర్), ఏ-4 హేమ శేఖర్, ఏ-5గా మణికంఠను రిమాండ్కు తరలించామన్నారు.
News February 5, 2025
పీఏసీ సభ్యుడిగా విష్ణుకుమార్ రాజు
రాష్ట్ర ప్రజాపద్ధుల కమిటీ సభ్యుడుగా పెనుమత్స విష్ణుకుమార్ రాజు నియమితులయ్యారు. విష్ణుకుమార్ రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శాసనసభలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివిధ కమిటీల సభ్యుల పేర్లను మంగళవారం ప్రకటించారు. ప్రజా పద్దుల కమిటీలో విష్ణుకుమార్ రాజుకు స్థానం లభించింది.
News February 5, 2025
విశాఖ: ఎమ్మెల్సీ బరిలో స్వతంత్ర అభ్యర్థి
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల ఆనందపురం ఎంఈవోగా పదవీ విరమణ చేసిన ఎస్.ఎస్.పద్మావతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె నామినేషన్ పత్రాలను కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎటువంటి రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ యూనియన్లతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.