News March 23, 2024
విశాఖ: పుట్టెడు దుఃఖంతో పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి

పదో తరగతి పరీక్ష రాస్తున్న దేశగిరి యమునకు పుట్టెడు దుఃఖం కలిగింది. జీకే వీధికి చెందిన యమున తల్లి సరస్వతి మృతిచెందిన సమాచారం తండ్రి కేశకర్ణ చేరవేశారు. రక్తపోటు అధికమై కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. పరీక్ష రాసి స్వగ్రామం దేవరపల్లిలో తల్లి అంత్యక్రియలకు విచ్చేసిన యమున బోరున విలపించింది. దీంతో గ్రామాల్లో విషాదఛాయలు అనుముకున్నాయి.
Similar News
News April 25, 2025
వందేళ్ల పండగకు రెఢీ అవుతున్న ఏయూ

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని ఉపకులపతి ప్రో.రాజశేఖర్ తెలిపారు. తొలిరోజు ఉదయం 6గంటలకు ఆర్కే బీచ్‌లో శతాబ్ది వాక్ థాన్ ప్రారంభంకానుందని అన్నారు. ఉ.9 గంటలకు ఏయూ పరిపాలన భవనం వద్ద బెలూన్ లాంచింగ్, మ.3.30 గంటల నుంచి ప్రధాన వేడుకలకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ఐఐటీ పాలక్కడ్ డైరెక్టర్ హాజరవుతారన్నారు.
News April 25, 2025
విశాఖ రేంజ్‌లో 9 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ

విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లను గురువారం డీఐజీ గోపినాథ్ జెట్టి బదిలీ చేశారు. ఈ మేరకు విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. బదిలీ అయిన ఇన్స్పెక్టర్లు తక్షణమే సంబంధిత బదిలీ స్థానంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరిలో కొందరు అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళ జిల్లాకు బదిలీ అయ్యారు.
News April 25, 2025
ఏయూ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన

ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్‌లో హాజరు సరిగ్గా లేదని 30మంది విద్యార్థుల హాల్ టికెట్స్ ఇవ్వకపోవడం ఘోరమన్నారు. ఈ విషయంపై గురువారం ఏయూ వీసీ ఆఫీస్ వద్ద AISF నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈవిషయం వీసీ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఫలితం లేదని నిరసన చేశారు. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ శశిభూషణరావు స్పందించి శుక్రవారం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.