News February 9, 2025
విశాఖ: ‘పైనుంచి మిమ్మల్ని చూస్తుంటా’

అగనంపూడి సమీపంలో రైలు కింద పడి <<15397134>>సూసైడ్ <<>>చేసుకున్న రాదేశ్(38) జేబులో లేఖ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో తన మృతికి ఎవరూ కారణం కాదని, అన్నయ్య పిల్లలు బాగా చదువుకోవాలని.. పైనుంచి మిమ్మల్ని చూస్తుంటానని రాసి ఉంది. కాగా.. ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడిది శ్రీహరిపురం కాగా.. ఫోను ఇంట్లోనే విడచిపెట్టి అగనంపూడి సమీపంలో రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు.
Similar News
News February 28, 2026
శంకుస్థాపలు సరే.. శిలఫలకాలు వేయరేం: ఎమ్మెల్యే

జీవీఎంసీ కౌన్సిల్ హాల్‌లో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. శంకుస్థాపనల అనంతరం శిలాఫలకాలు ఏర్పాటు చేయడం లేదని దీనిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతిరోజు ఎంతమంది పారిశుధ్య కార్మికులు హాజరవుతున్నారు? ఏ పనులు చేస్తున్నారనే అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు. 15 సంవత్సరాలుగా ఒకే వార్డులో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను మార్చాలని డిమాండ్ చేశారు.
News February 28, 2026
విశాఖలో నేటి నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్

విశాఖలో ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో నేటి నుంచి రెండు రోజుల పాటు ‘టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్’ (TCCL) ప్రారంభం కానుంది. సినీ నటులు శ్రీకాంత్, తరుణ్ నేతృత్వంలో సుమారు 110 మంది సినీ, టీవీ ప్రముఖులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. పేద విద్యార్థుల చదువులకు చేయూతనిచ్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించారు.
News February 28, 2026
విశాఖ: కేంద్ర కారాగారాన్ని సందర్శించిన జైళ్ల శాఖ ఐజీ

విశాఖ కేంద్ర కారాగారాన్ని జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావు సందర్శిచారు. ఏపీ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ బిల్లు-2026 అసెంబ్లీలో ప్రవేశపెట్టామని, గవర్నర్ ఆమోదం వెంటనే చట్టమవుతుందని తెలిపారు. జైళ్ల అభివృద్ధికి రూ.102 కోట్లు కేటాయించి, తొలి విడతగా రూ.53 కోట్లతో బ్యారక్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు రోజుల శిక్షణ ముగింపులో అధికారులకు సర్టిఫికెట్లు అందజేశారు.


