News January 18, 2026
విశాఖ పోర్టుకు మరో రికార్డు

విశాఖ పోర్టు మరో చారిత్రక రికార్డు సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 289 రోజుల్లోనే 70 మిలియన్ టన్నుల (7,01,74,002 టన్నులు) సరకు రవాణా పూర్తి చేసింది. 2026 జనవరి 14 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. పోర్టు ఏర్పాటైన 92 ఏళ్లలో ఇంత తక్కువ సమయంలో ఇంత భారీగా సరకు రవాణా ఇదే తొలిసారి. గతంలో 2024-25లో 316 రోజులు, 2023-24లో 320 రోజులు పట్టాయి.
Similar News
News February 17, 2026
ఈనెల 21న విశాఖ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు

విశాఖ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన ఈనెల 21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి 1 నుండి 7 వరకు గల స్థాయీ సంఘాల సమావేశాలు వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తామని సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు సంబంధిత శాఖల అధికారులు ప్రగతి నివేదికలతో ఈ సమావేశాలకు హాజరుకావాలని ఆయన కోరారు.
News February 16, 2026
అంతర్జాతీయ కార్యక్రమాల భద్రతపై సీపీ సమీక్ష

విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఐఎఫ్ఆర్, మిలాన్ వేడుకల భద్రతా ఏర్పాట్లపై సీపీ డా.శంఖబ్రత బాగ్చి ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. విదేశీ ప్రతినిధులు, VVIPల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై కీలక ఆదేశాలిచ్చారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు, డ్రోన్ నిఘా, CCTV మానిటరింగ్‌తో పాటు చిన్నారుల రక్షణకు RFID సాంకేతికతను వినియోగించాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు.
News February 16, 2026
విశాఖలో గవర్నర్‌కు ఘన స్వాగతం

విశాఖలో జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సోమవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, నగర పోలీసు కమిషనర్ సంఖ బ్రత బాగ్జీ, నౌకాదళ అధికారులు ఘన స్వాగతం పలికారు.


