News December 29, 2025

విశాఖ పోర్ట్‌ తొలి మహిళా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా రోష్ని అపరాంజి

image

మహిళా IAS అధికారి రోష్ని అపరాంజి కోరాటిమ పోర్ట్ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళా అధికారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు. అస్సాం–మేఘాలయ క్యాడర్‌కు చెందిన ఆమె విశాఖ వాసి కావడం విశేషం. ఆమె AU నుంచి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్‌లో గోల్డ్ మెడలిస్ట్‌గా నిలిచారు. అస్సాంలో కలెక్టర్‌గా, కేంద్ర డిప్యూటేషన్‌లో VSEZలో సేవలందించిన ఆమెకు 2018లో PM అవార్డు లభించింది.

Similar News

News December 30, 2025

వైకుంఠ ఏకాదశి: పురాణ గాథ ఇదే..

image

పూర్వం మధుకైటభులు అనే రాక్షసులను విష్ణువు సంహరించినప్పుడు వారు వైకుంఠ ద్వారం వద్ద స్వామిని దర్శించుకుని శాపవిమోచనం పొందారు. ఈ పవిత్ర దినాన తమలాగే ఎవరైతే ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటారో, వారికి మోక్షం ప్రసాదించాలని వారు కోరుకున్నారు. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి అంత ప్రాధాన్యత. తనను కొలిచే భక్తులను అనుగ్రహించడానికి శ్రీహరి ముక్కోటి దేవతలతో కలిసి భువికి చేరుకుంటారట.

News December 30, 2025

NTR: డబ్బులు వసూలు చేసి తెస్తుండగా ప్రమాదం..!

image

ఎలమంచిలి వద్ద ఆదివారం అర్ధరాత్రి ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ రైలులో 2 భోగీలు కాలిపోవడంతో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) మృతి చెందిన విషయం తెలిసిందే. అతని వద్ద ఉన్న బ్యాగులో రూ.6 లక్షల వరకు నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతను హోల్ సేల్ వస్త్ర వ్యాపారి అని, విజయనగరం నుంచి డబ్బులు వసూలు చేసుకుని విజయవాడకు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తుని ప్రభుత్వ రైల్వే ఎస్సై శ్రీనివాసరావు చెప్పారు.

News December 30, 2025

ధనుర్మాసం: పదిహేనో రోజు కీర్తన

image

నిద్రిస్తున్న ఓ గోపికను మేల్కొల్పే క్రమంలో ఆమెకు, గోపికలకు మధ్య జరిగిన సంభాషణ ఇది. బయట వారు ‘లేత చిలుకా! ఇంకా నిద్రనా?’ అని ఆటపట్టిస్తే, ఆమె లోపలి నుంచే ‘నేను వస్తున్నా, అంత గొంతు చించుకోకండి’ అని బదులిస్తుంది. ‘నీ మాటకారితనం మాకు తెలుసు’ అని వారు గేలి చేస్తే, ఆమె వినమ్రంగా జవాబిస్తుంది. చివరకు కంసుడిని, కువలయాపీడమనే ఏనుగును సంహరించిన కృష్ణుడి గుణగానం చేయడానికి అందరూ కలిసి వెళ్తారు. <<-se>>#DHANURMASAM<<>>